న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: 'భారత్‌కు రావడం ఇది 22వ సారి.. ఈ అనుభవంతో ఆర్సీబీకి కప్ తెస్తా'

IPL 2021: Glenn Maxwell says This is my 22nd trip to India, This experience helps to RCB

చెన్నై: తాను భారత్‌కు రావడం ఇది 22వ సారి అని.. ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులపై మంచి అవగాహన ఉందని ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తెలిపాడు. ఈ అనుభవంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు టైటిల్ అందించే ప్రయత్నం చేస్తానన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. చెన్నై వేదికగా శుక్రవారం జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

క్రికెటర్లకు పీడకల ఇది

క్రికెటర్లకు పీడకల ఇది

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యూట్యూబ్‌ ఛానల్‌తో గ్లెన్‌ మాక్స్‌వెల్‌ మాట్లాడాడు. 'వరుసగా బయో బుడగలకు పరిమితం అవ్వడం క్రికెటర్లకు ఎడతెగని పీడకలగా మారింది. తమ కర్తవ్యం నిర్వర్తించేందుకు ఆటగాళ్లు ప్రస్తుతం సంక్లిష్టమైన జీవనశైలి గడుపుతున్నారు. ప్రస్తుత రోజుల్లో బయటి ప్రపంచంతో క్రికెటర్లు సాధారణ సంభాషణను మర్చిపోవాల్సిందే. బుడగలు మానసిక ఆరోగ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. అయితే అభిమానులను రంజింపజేసేందుకు తిరిగి క్రికెట్‌ ఆడుతుండటం మాత్రం సంతోషంగా ఉంది' అని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ పేర్కొన్నాడు.

నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలి

నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలి

ఏదేమైనా తమ జీవనశైలి మాత్రం ఇబ్బందికరంగా ఉందని గ్లెన్‌ మాక్స్‌వెల్‌ స్పష్టం చేశాడు. ఇది అనుబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నాడు. ఈ గడ్డు కాలంలో మనకు మద్దతునిచ్చే నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవాలని మ్యాక్సీ సూచించాడు. కొన్నిరోజులు కాబోయే భార్యతో గడిపిరావడంతో మానసికంగా బాగున్నానని అతడు వెల్లడించాడు. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ తరపున మ్యాక్స్‌వెల్ ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌లాడి 108 పరుగులు మాత్రమే చేశాడు. భారీ హిట్టర్ అని పేరున్న అతడు కనీసం ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేకపోయాడు. మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరచడంతో పంజాబ్‌ జట్టు అతన్ని రిలీజ్‌ చేసింది.

వారితో ఆడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా

వారితో ఆడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా

ఐపీఎల్ 2021 వేలంలో బెంగళూరు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ను రూ.14.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. తాను ధర గురించి పట్టించుకోవడం లేదని.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని మాక్సీ తెలిపాడు. 'కోహ్లీ, డివిలియర్స్‌తో కలిసి ఆడాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. మైదానం ఆవల వారి గురించి తెలుసు. వారిపై కొన్ని మ్యాచులూ ఆడాను. ఎట్టకేలకు ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం వచ్చింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నా' అని మ్యాక్సీ తెలిపాడు.

ఆ అనుభవం జట్టుకు పనికొస్తుంది

ఆ అనుభవం జట్టుకు పనికొస్తుంది

'నాపై ఫ్రాంచైజీలకు కొంత ఆసక్తి ఉందని తెలుసు. చాలా జట్లు మిడిలార్డర్లో ఆడే విదేశీ ఆటగాళ్లను తీసుకున్నాయి. కొన్ని జట్లకు బ్యాటింగ్‌ చేసే ఆఫ్‌ స్పిన్నర్‌ అవసరముందని గ్రహించా. రెండు జట్లు నాకోసం పోటీపడటం.. ఆర్‌సీబీ దక్కించుకోవడం సంతోషంగా అనిపించింది. ప్రదర్శనల పరంగా నాకేమీ ఇబ్బంది లేదు. నేనెప్పుడూ సానుకూలంగానే ఉంటాను. అవసరమైతే కోహ్లీకి సాయం చేస్తా. ఎందుకంటే భారత్‌కు రావడం నాకిది 22వ సారి. ఇక్కడి పిచ్‌లు, పరిస్థితులపై అవగాహన ఉంది. ఆ అనుభవం జట్టుకు పనికొస్తుంది. కొత్త జట్టు, కొత్త మనుషులతో కలిసి ఆడుతున్నందుకు ఆసక్తిగా ఉంది. జట్టులో సంతోషాన్ని నింపాలనే అనుకుంటున్నా' అని మాక్సీ చెప్పుకోచ్చాడు.

‌‌IPL 2021: ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు.. ఎవరిని పిలవాలో మాకు తెలుసు: డివిలియర్స్‌

Story first published: Thursday, April 8, 2021, 15:02 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X