న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు.. ఎవరిని పిలవాలో మాకు తెలుసు: డివిలియర్స్‌

IPL 2021: AB de Villiers and Virat Kohli replying to Usain Bolts tweet on RCB

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ఆరంభానికి ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. దీంతో అభిమానుల్లో ఐపీఎల్ ఫీవర్‌ మొదలైంది. చెన్నై వేదికగా శుక్రవారం జరుగనున్న లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ను ఢీకొంటుంది. మొదటి మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో అభిమానులు ఇరు జట్లకు విషెష్ చెపుతున్నారు. అయితే ఆర్సీబీని ఆకట్టుకునేందుకు ప్రముఖ స్ప్రింటర్‌‌, జమైకా చిరుత ఉసేన్‌ బోల్ట్‌ బుధవారం కొత్త ప్రయత్నం చేశాడు.

ఉసేన్‌ బోల్ట్‌ బెంగళూరు జెర్సీ ధరించి ఓ ట్వీట్ చేశాడు. 'రాయల్ ఛాలెంజర్స్..‌ మీకో విషయం తెలియజేస్తున్నా. నేనింకా అత్యంత వేగంగా పరుగులు తీసేవాడినే' అని పేర్కొంటూ సరదాగా ట్వీట్‌ చేశాడు. బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌తో పాటు ప్యూమా క్రికెట్‌, ఆర్సీబీ జట్టును కూడా బోల్ట్‌ ట్యాగ్‌ చేశాడు. బోల్ట్‌ చేసిన ట్వీట్‌కు కోహ్లీ, డివిలియర్స్ స్పందించారు. 'నీ శక్తి సామర్థ్యాల్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇప్పుడు నిన్ను మా టీమ్‌లో చేర్చుకున్నాం' అని కోహ్లీ పేర్కొనగా.. 'మాకు ఎక్కువ పరుగులు అవసరమైనప్పుడు ఎవర్ని పిలవాలో తెలుసు' అని డివిలియర్స్‌ రీట్వీట్‌ చేశాడు.

ప్యూమా ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అధికారిక కిట్‌ స్పాన్సర్‌గా మారింది. ఉసేన్‌ బోల్ట్‌ సైతం అదే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఐపీఎల్‌ 2021 ప్రధాన స్పాన్సర్‌గా వ్యహరిస్తున్న చైనీస్ మొబైల్ కంపెనీ‌ 'వివో' కూడా బుధవారం విరాట్‌ కోహ్లీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించని సంగతి తెలిసిందే. దీంతో ఈసారైనా కోహ్లీసేన కప్పు గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆర్‌సీబీ టీమ్..
బ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, పవన్ దేశ్‌పాండే, సచిన్ బేబీ, రజత్ పాటిదార్, సచిన్ బేబీ,

కీపర్స్: ఏబీ డివిలియర్స్, మహ్మద్ అజారుద్దీన్, కేఎస్ భరత్, ఫిన్ అలెన్

ఆల్‌రౌండర్స్: గ్లేన్ మ్యాక్స్‌వెల్, వాషింగ్టన్ సుందర్, డానియల్ సామ్స్, హర్షల్ పటేల్, కైల్ జెమీసన్, డానియల్‌ క్రిస్టియన్‌, సయాష్‌ ప్రభు దేశాయ్‌

బౌలర్లు: మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్‌సన్, యుజ్వేంద్ర చాహల్, నవ్‌‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, పవన్ దేశ్‌పాండే, షాబాజ్ అహ్మద్

IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అందుకుంది వీరే.. టాప్-5లో భారత్ నుంచి ఇద్దరు!!IPL 2021: ఐపీఎల్‌లో అత్యధిక 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అందుకుంది వీరే.. టాప్-5లో భారత్ నుంచి ఇద్దరు!!

Story first published: Thursday, April 8, 2021, 13:29 [IST]
Other articles published on Apr 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X