న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: వాంఖడేలో కరోనా కలకలం.. వైరస్ బారిన మైదాన సిబ్బంది.. పునరాలోచనలో బీసీసీఐ!

IPL 2021: Eight groundsmen at Wankhede Stadium test positive for Coronavirus

ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ఆరంభానికి ముందే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి గట్టి షాక్ తగిలింది. కరోనా నేపథ్యంలో బోర్డు 6 నగరాలను షార్ట్ లిస్ట్ చేయగా.. అందులో ముంబై‌, వాంఖడే మైదానంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా మైదాన సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా వైరస్ సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. దాంతో ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న లీగ్‌ మ్యాచ్‌ను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది.

 ముంబైలో డౌటే..

ముంబైలో డౌటే..

తాజాగా కరోనా కేసులు వెలుగు చూడడంతో వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉంది. ఈ క్రమంలో ఇక్కడ మ్యాచ్‌లు నిర్వహించి రిస్క్ తీసుకోవడం అవసరమనే భావనలో బోర్డు వర్గాలున్నట్లు తెలుస్తోంది. ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లను వేరే నగరానికి తరలిస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో కరోనా ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ను 6 వేదికల్లోనే నిర్వహించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ వేదికలుగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

 ముంబై వద్దన్నా...

ముంబై వద్దన్నా...

ఐపీఎల్‌లో ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలకు హోం అడ్వాంటేజ్‌ లేకుండా తటస్ఠ వేదికల్లో మ్యాచ్‌లు ఆడేలా ఏర్పాట్లు చేసింది. ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిఉన్న నేపథ్యంలో తాజాగా వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా సోకడంతో కలవరం మొదలైంది. అయితే ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణపై మొదటి నుంచి విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అక్కడ మ్యాచ్‌ల నిర్వహణ అంత క్షేమం కాదని ఫ్రాంచైజీలు, ఇతర రాష్ట్రల క్రికెట్ బోర్డులు బీసీసీఐ ముందు మొత్తుకున్నాయి.

హైదరాబాద్‌కు తరలిస్తే..

హైదరాబాద్‌కు తరలిస్తే..

కానీ ఇవన్నీ పట్టించుకోని బీసీసీఐ మొండిగా ముందుకెళ్లి ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఒకవేళ మ్యాచ్‌ల జరుగుతుండగా ఏ ఆటగాడైన కరోనా బారిన పడితే.. లీగ్ మొత్తం వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో బీసీసీఐ ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు వేదికను మార్చాలంటే బీసీసీఐ ముందున్న ఏకైక ఆప్షన్ హైదరాబాద్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నామమాత్రంగానే నమోదవుతున్నాయి. జిల్లాల్లో ఎక్కువగా ఉన్నా.. నగరంలో పరిస్థితి అదుపులోని ఉంది. పైగా ఐపీఎల్ నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Story first published: Saturday, April 3, 2021, 12:16 [IST]
Other articles published on Apr 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X