న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Delhi Capitals‌కు రిషభ్ పంత్ టైటిల్ అందించెనా? టీమ్ బలాలు, బలహీనతలు!

IPL 2021: Delhi Capitals (DC) Strength, Weakness, Best Playing 11 and Prediction
IPL 2021 : Delhi Capitals SWOT | Rishabh Pant - IPL Title అనుభవం, దూకుడు కలగలిసి పటిష్ఠంగా DC

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అసలు 2019 ముందు వరకూ ఆ జట్టుపై పెద్దగా అంచనాల్లేవు.. ఎందుకంటే అంతకుముందు ఆరు సీజన్లలో ఆ జట్టు ప్రదర్శన పేలవం. ఆఖరి స్థానంలో లేదా చివరి నుంచి రెండో స్థానంలో నిలుస్తూ వచ్చింది. కానీ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచింది.

కానీ ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సేవలను కోల్పోయింది. దాంతో రిషభ్ పంత్ తొలిసారి జట్టును నడిపించనున్నాడు. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో.. అనుభవం, దూకుడు కలగలిసి.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు.. కోచ్ రికీ పాంటింగ్ పర్యవేక్షణలో ఈ సారైనా టైటిల్ సాధిస్తుందో? లేదో చూడాలి.

బలాలు..

బలాలు..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తర్వాత అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో టీమ్ పటిష్టంగా ఉంది. మంచి ఓపెనర్లు.. గొప్ప మిడిలార్డర్‌.. సూపర్‌ ఫినిషర్లు ఆ జట్టు సొంతం. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కొత్తగా జట్టులోకి వచ్చిన స్మిత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన క్లాస్‌కు మాస్‌ జోడించి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడగలడు. వీళ్లకు తోడు రహానే ఉండనే ఉన్నాడు. ఇక ఈ సారి లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆటగాడిగా కెప్టెన్ రిషభ్ పంత్‌పై భారీ అంచనాలున్నాయి. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతను ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగలడు. ఇప్పుడు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు కాబట్టి మరింత దూకుడుతో జట్టుకు విజయాలు అందించే అవకాశం ఉంది.

హెట్‌మయర్‌తో పాటు విదేశీ ఆల్‌రౌండర్లు స్టాయినిస్‌, క్రిస్‌ వోక్స్‌, సామ్‌ బిల్లింగ్స్‌, టామ్‌ కరన్‌ భారీ షాట్లతో మ్యాచ్‌ను ముగించగలరు. బౌలింగ్‌లోనూ ఆ జట్టుకు ఎదురులేదు. గత సీజన్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించిన రబాడ, అన్రిచ్ నోర్జ్‌ ద్వయం మరోసారి సత్తాచాటేందుకు సిద్ధమైంది. వీళ్లకు తోడు భారత స్టార్ పేసర్లు ఇషాంత్‌, ఉమేశ్‌ కూడా ఉన్నారు. ఇక స్పిన్‌లో సీనియర్లు మిశ్రా, అశ్విన్‌ అనుభవంతో పాటు అక్షర్‌ పటేల్‌ ఫామ్‌ జట్టుకు ఉపయోగపడేదే.

బలహీనతలు..

బలహీనతలు..

2018 సీజన్‌ మధ్యలో పగ్గాలు చేపట్టి.. జట్టుకు దూకుడు నేర్పి.. ఆటగాళ్ల ఆలోచనా విధానంతో పాటు దృక్పథాన్ని మార్చిన శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరమవడం ఆ జట్టుకు ఇబ్బంది కలిగించే అంశం. కెప్టెన్‌గానే కాకుండా నాలుగో స్థానంలో కీలక ఆటగాడిగా అతను జట్టుకు ఎంతో అవసరం. బ్యాటింగ్‌ పరంగా ఇప్పుడు ఇబ్బందులు లేనప్పటికీ.. సారథిగా అతని స్థానంలో బాధ్యతలు తీసుకున్న 23 ఏళ్ల పంత్‌ ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడానేది ప్రశ్నార్థకంగా మారింది.

అతనికి కెప్టెన్సీ భారంగా మారితే జట్టుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇక మ్యాచ్‌ల్లో ఏ నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనేది కూడా ఆ జట్టుకు తలనొప్పిగా మారనుంది. ఇప్పటికే జట్టులో ఉన్న విదేశీ ఆటగాళ్లు చాలదన్నట్లు.. వేలంలో స్మిత్‌, టామ్‌ కరన్‌, బిల్లింగ్స్‌లను తీసుకున్నారు. గత సీజన్‌కు దూరమైన వోక్స్‌ తిరిగొచ్చాడు. మామూలుగా అయితే రబడా, నోర్జ్‌ పేసర్లుగా జట్టులో కొనసాగుతారు. గత సీజన్‌లో మెరిసిన స్టోయినిస్‌ ఆల్‌రౌండర్‌గా ఉంటాడు. మిగిలిన ఒక్క స్థానంలో స్మిత్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ.

ప్లే ఆఫ్స్ అంచనా..

ప్లే ఆఫ్స్ అంచనా..

రికీ పాంటింగ్ అండ, యువ ఆటగాళ్లతో జట్టు బలంగా ఉంది కాబట్టి ఈ సారి టైటిల్ రేసులోకి రావొచ్చు. ప్లే ఆఫ్స్‌కు ఈజీగా చేరుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరడం పక్కా అని విశ్లేషిస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్..

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్..

బ్యాట్స్‌మెన్: స్టీవ్ స్మిత్, శిఖర్ ధావన్, పృథ్వీషా, అజింక్యా రహానే. హెట్‌మైర్, లక్మన్ మెరీవాల, రిపల్ పటేల్, విష్ణు వినోద్,

ఆల్‌రౌండర్లు: మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, క్రిస్ వోక్స్

వికెట్ కీపర్లు: రిషభ్ పంత్, సామ్ బిల్లింగ్స్

బౌలర్లు: అమిత్ మిశ్రా, నోర్జ్, అవేశ్ ఖాన్, సిద్దార్థ్, టామ్ కరన్, ప్రవీణ్ దూబే, ఇషాంత్ శర్మ, కగిసో రబాడ, మోహిత్ శర్మ

Story first published: Tuesday, April 6, 2021, 11:33 [IST]
Other articles published on Apr 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X