న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: చెలరేగిన డివిలియర్స్.. ఢిల్లీ ముందు టఫ్ టార్గెట్!

AB de Villiers 75 not out gives Bangalore 171
IPL 2021, DC vs RCB: Kohli Praises AB de Villier And Mohammed Siraj | Oneindia Telugu

అహ్మదాబాద్: ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసం సృష్టించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 172 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. ఏబీడీకి తోడుగా.. యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 31), గ్లేన్ మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25) సత్తా చాటడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. మార్కస్ స్టోయినిస్ వేసిన చివరి ఓవర్‌లోనే ఏబీడీ మూడు సిక్సర్లతో 23 పరుగుల పిండుకున్నాడు.

 నిరాశపరిచిన కోహ్లీ, పడిక్కల్..

నిరాశపరిచిన కోహ్లీ, పడిక్కల్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(12), దేవదత్ పడిక్కల్(17) ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టినా.. వరుస బంతుల్లో ఔటయ్యారు. ఫస్ట్ ఓవర్‌లో పడిక్కల్ ఫొర్ కొట్టి జోరుకనబర్చగా.. రబడా వేసిన సెకండ్ ఓవర్‌లో కోహ్లీ కూడా ఫోర్ కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో ఫోర్ కొట్టిన విరాట్.. ఆ తర్వాత నాలుగు బంతులు తడబడి.. ఆరో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని విరాట్ కట్ షాట్ ప్రయత్నంలో వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఇషాంత్ శర్మ వేసిన ఆ మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్‌కే పడిక్కల్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మెన్‌తో కలిసి గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆర్‌సీబీ పవర్‌ప్లేలో 2 వికెట్లకు 36 రన్స్ చేసింది.

ఆదుకున్న పటిదార్, ఏబీడీ..

ఆదుకున్న పటిదార్, ఏబీడీ..

సూపర్ ఓవర్ అనంతరం గేర్ మార్చిన మ్యాడ్ మ్యాక్సీ.. మిశ్రా బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్‌తో తన బౌండరీల ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టి ప్రమాదకరంగా కనిపించిన మ్యాక్సీని అమిత్ మిశ్రా బోల్తా కొట్టించాడు. అతను వేసిన 9 ఓవర్ మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించిన మ్యాక్సీ.. స్మిత్‌కు చిక్కాడు. క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. యువ ప్లేయర్ పటిదార్‌తో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. నిదానంగా ఆడుతూ క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసిన ఈ జోడీ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేసింది. మిశ్రా బౌలింగ్‌లో బ్యూటిఫుల్ సిక్స్ కొట్టిన పటిదార్.. ఏబీడీపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేశాడు. రబడా బౌలింగ్‌లో బౌండరీ కొట్టి ఏబీడీ టచ్‌లోకి రాగా.. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టిన పటిదార్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఏబీడీ భారీ సిక్సర్ కొట్టగా.. ఆ ఓవర్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి పటిదార్ వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 54 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.

 ఏబీడీ ఫిఫ్టీ..

ఏబీడీ ఫిఫ్టీ..

క్రీజులోకి సుంధర్ రాగా.. ఏబీడీ తన జోరును కొనసాగించాడు. ఇక రబడా వేసిన 18 ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా ఏబీడీ భారీ సిక్సర్ కొట్టగా.. చివరి బంతికి సుంధర్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి డానియల్ సామ్స్(3)రాగా.. అవేశ్ ఖాన్ వేసిన 19 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా బౌండరీగా తరలించి 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది రెండో హాఫ్ సెంచరీ. మార్కస్ స్టోయినిస్ వేసిన చివరి ఓవర్‌లో ఏబీడీ మూడు సిక్సర్లు బాదడంతో 23 రన్స్ వచ్చాయి. దాంతో ఆర్‌సీబీ 171 పరుగులు చేసింది. ఈ ఓవర్‌ నాలుగో బంతి ని ఓవర్ షార్ట్ ఫైన్ లీగ్ మీదుగా ఏబీడి కొట్టిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Story first published: Tuesday, April 27, 2021, 22:19 [IST]
Other articles published on Apr 27, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X