న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs KKR:ఢిల్లీ జోరు ముందు కోల్‌కతా నిలిచేనా.. ఇరు జట్లను కలవరపెడుతోన్న వారి ఫామ్! తుది జట్లు ఇవే!

IPL 2021: DC vs KKR predicted playing 11, Preview and dream11 tips for match 25

అహ్మదాబాద్‌: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో మరో ఆసక్తికర సమరం ఈ రోజు జరగనుంది. నాలుగు విజయాలతో మంచి జోరుమీదున్న ఢిల్లీ క్యాపిటల్స్, భారీ హిట్టర్లతో నిండిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఢీ కొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది. పట్టికలో టాప్-4లో కొనసాగుతున్న ఢిల్లీ.. గత మ్యాచులో బెంగళూరుపై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న కోల్‌కతా థన్ చివరి మ్యాచులో పంజాబ్ జట్టుపై గెలిచింది. నాలుగు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు రుచి చూసిన కోల్‌కతా అదే జోరుని కొనసాగించాలని చూస్తుండగా.. మరో విజయంపై ఢిల్లీ కన్నేసింది. ఇరు జట్లలో కూడా భారీ హిట్టర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

CSK vs SRH: ఈజీ క్యాచ్‌ వదిలేసిన ఎంఎస్ ధోనీ.. సీరియస్ అయిన బౌలర్?! (వీడియో)

స్టోయినిస్ ఇంకెప్పుడు:

స్టోయినిస్ ఇంకెప్పుడు:

ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా ధాటిగా ఆడుతూ మంచి ఆరంభాలు ఇస్తున్నారు. పవర్ ప్లే‌లో బౌండరీల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా షా మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఒక్కోసారి తక్కువ స్కోర్లకే ఔటవుతున్నారు. స్టీవ్‌ స్మిత్ నెమ్మదిగా ఆడుతూ జట్టుకు భారంగా మారాడు. కెప్టెన్ రిషబ్ పంత్, హిట్టర్ షిమ్రాన్ హిట్‌మెయర్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలు చేసి మళ్లీ ఫామ్ అందుకున్నారు. హిట్‌మెయర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. అయితే ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఫామ్ ఢిల్లీని ఆందోళనకు గురిచేస్తోంది. స్టోయినిస్ ఒక్కడు గాడిలో పడితే తిరుగుండదు.

బౌలర్లని వాడుకోవడంలో పంత్ విఫలం:

బౌలర్లని వాడుకోవడంలో పంత్ విఫలం:

బౌలింగ్‌లో కూడా ఢిల్లీ పటిష్టంగానే ఉంది. కగిసో రబాడ, అవేష్ ఖాన్‌కి జోడీగా ఇషాంత్ శర్మ రావడంతో.. పేస్ బలం మరింత పెరిగింది. ఇన్నింగ్స్ ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నా.. చివరలో కాస్త పరుగులు ఇస్తున్నారు. అయితే ఈ ముగ్గురినీ కెప్టెన్ రిషబ్ పంత్ సమర్థంగా వినియోగించుకోవట్లేదు. మిడిల్ ఓవర్లలో అమిత్ మిశ్రా రాణిస్తుండగా.. అక్షర్ పటేల్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బౌలర్లని వాడుకోవడంలో పంత్ విఫలమవుతున్నాడు. ఈ విషయంలో పంత్ మరింత కసరత్తు చేయాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.చేయాల్సిందే.

నిరాశపరుస్తున్న రాణా, గిల్:

నిరాశపరుస్తున్న రాణా, గిల్:

కోల్‌కతాలో ఓపెనర్లు నితీశ్ రాణా, శుభమన్ గిల్ నిరాశపరుస్తున్నారు. ఇద్దరిలో ఒకరు త్వరగానే పెవిలియన్‌కి చేరిపోతున్నారు. దాంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడుతోంది. రాహుల్ త్రిపాఠి ధాటిగా ఆడుతుండగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫామ్ అందుకోవడం సంతోషకరమైన విషయం. దినేశ్ కార్తీక్ ఫినిషర్ రోల్‌ని పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆండ్రీ రసెల్ మెరుపులు ఒక మ్యాచుకు పరిమితం అయ్యాయి. బౌలింగ్‌లో శివమ్ మావి, పాట్ కమిన్స్‌ అదరగొడుతున్నారు. ప్రసీద్ క్రిష్ణ మాత్రం భారీగా పరుగులిస్తున్నాడు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో రసెల్ కూడా చెలరేగితే కోల్‌కతాకు తిరుగుండదు.

హెడ్ టు హెడ్ రికార్డులు:

హెడ్ టు హెడ్ రికార్డులు:

ఐపీఎల్‌లో ఢిల్లీ, కోల్‌కతా హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. కోల్‌కతాదే పైచేయి. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా.. 14 మ్యాచ్‌ల్లో కోల్‌కతా విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇక ఢిల్లీపై కోల్‌కతా ఇప్పటి వరకూ చేసిన అత్యధిక స్కోరు 210 కాగా.. కోల్‌కతాపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 228. మోడీ పిచ్ బౌలర్లకు అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 170 పరుగులు చేస్తే.. విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాచుకు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ఢిల్లీ: శిఖర్ ధావన్, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్, రిషబ్ పంత్, షిమ్రాన్ హిట్‌మెయర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, కగిసో రబాడ, అవేష్ ఖాన్‌, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా.

కోల్‌కతా: నితీశ్ రాణా, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌, ప్రసీద్ క్రిష్ణ, వరుణ్ చక్రవర్తి.

Story first published: Thursday, April 29, 2021, 14:05 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X