For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CSK vs SRH: ఈజీ క్యాచ్‌ వదిలేసిన ఎంఎస్ ధోనీ.. సీరియస్ అయిన బౌలర్?! (వీడియో)

CSK pacer Deepak Chahar showing his frustration on MS Dhoni after drops a simple catch vs SRH
IPL 2021:MS Dhoni Drops Easy Catch- Deepak Chahar Frustrated మహీ క్యాచ్‌ వదిలేశాడా?| Oneindia Telugu

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికల్ని నిశితంగా పరిశీలించే మహీ.. రెప్పపాటులో స్టంపింగ్ చేస్తుంటాడు. అంతేకాదు వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతుల్ని కూడా డైవ్ చేస్తూ సునాయాసంగా క్యాచ్‌లుగా అందుకుంటాడు. మహీ వయసు పెరిగినా, అంతర్జాతీయ ఆటకు రిటైర్మెంట్ ఇచ్చినా.. తన కీపింగ్‌లో మాత్రం ఎలాంటి తేడా లేదు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓ సులువైన క్యాచ్‌ని ధోనీ పట్టలేకపోయాడు. దాంతో చెన్నై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీలోని అరుణ్ జై ట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీపక్‌ చహర్‌ వేసిన రెండో బంతికే స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను అవుట్‌ చేసే అవకాశం ఎంఎస్ ధోనీకి వచ్చింది. కానీ బంతి దిశను సరిగ్గా అంచనా వేయలేక మహీ పూర్తిగా ఎడమ వైపునకు రావడంతో అతడి చేతుల్లో పడినట్లే పడి కింద పడిపోయింది. దీంతో బెయిర్‌స్టోకు లైఫ్‌ లభించింది.

లెగ్ స్టంప్‌కి సమీపంలో వెళ్తున్న బంతిని ఫైన్ లెగ్ దిశగా ప్లిక్ చేసేందుకు బెయిర్‌స్టో ప్రయత్నించాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వెనక్కి వెళ్లింది. క్యాచ్ కోసం పక్కకి డైవ్ చేసిన ధోనీ.. బంతి చేతుల్లో పడినా పట్టుకోలేకపోయాడు. అతని గ్లౌవ్స్ నుంచి బౌన్స్ అయిన బంతి కింద పడిపోయింది. ధోనీ అంత సులువైన క్యాచ్‌ని చేజార్చడంతో చహర్ సీరియస్‌గా అతనివైపు కాసేపు చూశాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో శామ్ కరన్ బౌలింగ్‌లో చహర్‌కి క్యాచ్ ఇచ్చి బెయిర్‌స్టో ఔటయ్యాడు. మహీ క్యాచుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. 'ఏంటీ.. మహీ క్యాచ్‌ వదిలేశాడా?', 'నేను నమ్మను అంత ఈజీ క్యాచ్‌ పట్టుకోలేదా?', 'అదే నిజమైతే అంతకంటే విచిత్రం ఏమీ ఉండదు' అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

గత సీజన్‌లో చెన్నై విఫలమైనా ఆ చేదు జ్ఞాపకాలు చెరిపేసేలా.. ఐపీఎల్‌ 2021లో వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తన పేరిట అనేక రికార్డులు లిఖించుకున్న ఎంఎస్ ధోనీ.. బెస్ట్‌ వికెట్‌ కీపర్‌గానూ పేరు తెచ్చుకున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ అనేకసార్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టిన మహీ.. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు 150 మందిని అవుట్‌ చేశాడు.

Story first published: Friday, April 30, 2021, 9:16 [IST]
Other articles published on Apr 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+