న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్‌కే.. వాట్సన్‌ స్థానం అతనిదేనా?

IPL 2021: Chennai Super Kings eye on Steve Smith, Glenn Maxwell and Dawid Malan in Mini Auction
IPL 2021: CSK Likely to Purchase Glenn Maxwell, Steve Smith, Dawid Malan in Mini Auction

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 సీజన్‌ కోసం ఫిబ్రవరిలో బీసీసీఐ మినీ వేలాన్ని నిర్వహించనుంది. జనవరి 20తోనే ఆటగాళ్ల రిటెన్షన్‌ గడువు ముగిసిపోగా.. ఆయా ఫ్రాంఛైజీలు పలువురు ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇక జట్ల మధ్య ప్లేయర్ల ట్రేడింగ్‌ విండో ఫిబ్రవరి 4న ముగియనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) 18 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. ఆరుగురు ఆటగాళ్లను రిలీజ్ చేసింది. అయితే ముగ్గురు స్టార్ ఆటగాళ్లను వేలంలో దక్కించుకొవాలని సీఎస్‌కే చూస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌లపై కన్ను:

స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌లపై కన్ను:

కేదార్‌ జాదవ్‌, మురళీ విజయ్‌, హర్భజన్‌ సింగ్‌, పియూశ్‌ చావ్లా, మోనూ సింగ్‌లతో పాటు రిటైర్మెంట్‌ ప్రకటించిన షేన్‌ వాట్సన్‌ను సీఎస్‌కే ఫ్రాంఛైజీ విడిచిపెట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు వదులుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లను 2021 సీజన్‌ వేలంలో ఎలాగైనా దక్కించుకోవాలని సీఎస్‌కే చూస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాబిన్‌ ఊతప్పను ట్రేడింగ్‌ విండో ద్వారా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

 వాట్సన్‌ స్థానంలో మలన్‌:

వాట్సన్‌ స్థానంలో మలన్‌:

ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆడని ఇంగ్లాండ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ను కూడా దక్కించుకోవాలని సీఎస్‌కే చూస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. టీ20 క్రికెట్లో మలన్‌కు మంచి రికార్డు ఉంది. ఐసీసీ వరల్డ్‌ నంబర్‌ వన్‌ టీ20 బ్యాట్స్‌మన్‌గా మలన్‌ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ఆడుతున్నాడు. చెన్నై మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్‌ స్థానాన్ని మలన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక స్టీవ్‌ స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌‌తో మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. ఐపీఎల్ 2020లో స్మిత్, మ్యాక్స్‌వెల్ విఫలమయిన విషయం తెలిసిందే. అయినా చెన్నై వారిపై నమ్మకంగా ఉంది.

 వేలంలోకి వదిలేయడమేంటి:

వేలంలోకి వదిలేయడమేంటి:

ఏదేమైనా కేదార్ జాదవ్‌ని చెన్నై వేలంలోకి వదిలేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జాదవ్ మంచి సన్నిహితుడన్న పేరుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా విఫలమైనా.. మహీ అతడికి వరుసగా తుది జట్టులో అవకాశాలిచ్చాడు. మరి అలాంటి జాదవ్‌ని చెన్నై వేలంలోకి వదిలేయడమేంటి? అని సందేహాలు వ్యక్తమయ్యాయి. జాదవ్‌ని గత ఏడాది రూ.7.8 కోట్లకి సీఎస్‌కే రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన జాదవ్ కేవలం 62 పరుగులు మాత్రమే చేశాడు.

 చెన్నై సూపర్ కింగ్స్ లిస్ట్:

చెన్నై సూపర్ కింగ్స్ లిస్ట్:

రిటైన్ ప్లేయర్లు: ఎంఎస్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, ఎం ఆసిఫ్, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి.

వదులుకున్న ప్లేయర్లు: కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ (రిటైర్డ్), పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్.

ఆ వ్యూహంతోనే ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాం.. వికెట్లు ఇచ్చారు: సిరాజ్‌

Story first published: Monday, January 25, 2021, 19:50 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X