న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ చెత్త కెప్టెన్సీ, పనికిరాని ప్రణాళికలే పంజాబ్ కింగ్స్ కొంపముంచాయి: ఆశిష్ నెహ్రా

IPL 2021: Ashish Nehra slams PBKS skipper KL Rahul for mismanaging bowlers against DC
IPL 2021: Nehra Slams KL Rahul For PBKS Loss | Oneindia Telugu

న్యూఢిల్లీ: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి కేఎల్ రాహుల్ చెత్త కెప్టెన్సీనే కారణమని ఆశిష్ నెహ్రా తెలిపాడు. మైదానంలో అతని అనాలోచిత నిర్ణయాలే పంజాబ్ కింగ్స్ కొంపముంచాయన్నాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ ఈ మ్యాచ్‌ను విశ్లేషించిన నెహ్రా.. రాహుల్ తీరును తప్పుబట్టాడు. బౌలర్లు వాడుకున్న విధానం ఏ మాత్రం బాలేదని విమర్శించాడు. పంజాబ్ కింగ్స్ కోచ్, కెప్టెన్ తదుపరి మ్యాచ్‌లకు మెరుగైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని చురకలింటించాడు.

చెత్త కెప్టెన్సీ

చెత్త కెప్టెన్సీ

'ఈ టీ20 ఫార్మాట్‌లో ప్రతీ ప్లేయర్‌కు కొన్ని విషయాలు కామన్‌గా ఉంటాయి. బ్యాటింగ్ బాగా చేయడం, బౌలింగ్‌లో సత్తా చాటడం, సూపర్ ఫీల్డింగ్‌‌తో అదరగొట్టడం, రాణించడం, విఫలమవడం అన్నీ ఆటలో ప్రతీ ఒక్కరికి సహజమే. కానీ కొన్ని మాత్రం కెప్టెన్ అదుపులోనే ఉంటాయి. కనీసం వాటినైనా సమర్థవంతంగా నిర్వహించాలి. అత్యధిక ధర పెట్టి కొన్న ఓవర్‌సీస్ బౌలర్లతో పంజాబ్ ముందుగా బౌలింగ్ చేయించలేదు. 10 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు వచ్చిన మెరిడిత్‌ తన ఫస్ట్ ఓవర్‌లోనే స్మిత్ వికెట్ తీశాడు. ఆఖరికి షమీ కూడా నాలుగు ఓవర్లను నాలుగు స్పెల్స్‌లో వేసాడు. అర్ష్‌దీప్‌కు అధిక ప్రాధానత్య ఇస్తూ ప్రారంభంలోనే బౌలింగ్ చేయించారు. ఇలా గేమ్‌ను ఎక్కడ కంట్రోల్‌ ఉంచలేదు'అని రాహుల్‌ కెప్టెన్సీని నెహ్రా తప్పుబట్టాడు.

పనికిరాని ప్రణాళికలు..

పనికిరాని ప్రణాళికలు..

తదుపరి మ్యాచ్‌కైనా పంజాబ్ కింగ్స్ కెప్టెన్, కోచ్ మంచి వ్యూహాలతో బరిలోకి దిగాలని సూచించాడు. 'పంజాబ్ కింగ్స్ వ్యూహాలు ఎలా ఉన్నాయంటే.. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్‌కు బదులుగా జలజ్ సక్సెనా, మహ్మద్ షమీ లేదా షారుఖ్ ఖాన్ పంపినట్లుంది. కాబట్టి రాహుల్.. తన కోచ్ అనిల్ కుంబ్లేతో కలిసి కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోవాలి. తదుపరి మ్యాచ్‌కు మంచి ప్రణాళికలతో రావాలి. ఈ రోజు మాత్రం వారి వ్యూహం ఏంటో నాకు మాత్రం అర్థం కాలేదు. ముఖ్యంగా వారి బౌలింగ్ ప్రణాళికలు దారుణంగా ఉన్నాయి. ప్రారంభంలో నలుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించారు. బౌలర్లు కొరత ఉన్న జట్లే అలా నలుగురు బౌలర్లతో బౌలింగ్ చేయిస్తాయి. నాకు తెలిసి ఢిల్లీతో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేసిన అతిపెద్ద తప్పిదం ఇదే'అని నెహ్రా చెప్పుకొచ్చాడు.

ఢిల్లీ అలవోకగా..

ఢిల్లీ అలవోకగా..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69), బర్త్‌డే బాయ్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, లుక్మాన్ మెరివాలా, కగిసోరబడా, అవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 198 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. ధావన్‌కు తోడుగా పృథ్వీ షా(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), మార్కస్ స్టోయినిస్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీయగా.. రిలే మెరిడిత్, అర్ష్‌దీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Monday, April 19, 2021, 12:19 [IST]
Other articles published on Apr 19, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X