న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ షా బ్యాటింగ్‌కు పట్టిన వైరస్ తొలిగిపోయింది: జడేజా

IPL 2021: Ajay Jadeja says A virus has been removed from Prithvi Shaw batting

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ పృథ్వీషాపై మాజీ క్రికెటర్, కామెంటేటర్ అజేయ్ జడేజా ప్రశంసల జల్లు కురిపించాడు. పృథ్వీ షా బ్యాటింగ్‌కు పట్టిన వైరస్ తొలిగిపోయిందని, ఇప్పుడు అతని బ్యాటింగ్‌లో ఎలాంటి టెక్నికల్ లోపం లేదన్నాడు. చాలా స్వేచ్చగా ఆడుతున్నాడని, అతని ఆటను చూస్తుంటే వైరస్ లేని కంప్యూటర్‌ను ఆపరేట్ చేసినట్లుందని కొనియాడాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా(0, 2).. ఒకేరీతిలో క్లీన్ బౌల్డ్ అయి జట్టులో చోటు కోల్పోయాడు.

షా విధ్వంసం..

షా విధ్వంసం..

అతని బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో భారత్‌కు వచ్చిన అనంతరం తన లోపాలపై దృష్టిసారించాడు. తన కోచ్‌లతో చర్చించి టెక్నిక్ లోపాలను సరిదిద్దుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ టోర్నీలో ఏకంగా 800 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

ఇక ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించిన పృథ్వీ షా.. ఢిల్లీ క్యాపిటల్స్ సునాయస విజయాలందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 6 ఫోర్లు కొట్టి అరుదైన ఫీట్ నెలకొల్పాడు.

వైరస్ తొలగింపు..

వైరస్ తొలగింపు..

తాజాగా క్రిక్‌బజ్‌ షోలో షా విధ్వంసకర బ్యాటింగ్‌పై స్పందించిన అజేయ్ జడేజా.. అతని ఆటను కొనియాడాడు. 'కంప్యూటర్ నుంచి వైరస్ సోకినట్లే.. పృథ్వీ షా బ్యాటింగ్ నుంచి కూడా వైరస్ తీసేసినట్లు అనిపిస్తుంది. గతేడాది అతని టెక్నిక్, మైండ్‌కు కొంచెం వైరస్ సోకింది. ఓ ఆటగాడిగా ఆ షాక్‌ నుంచి షా తేరుకున్నాడు. అతనో అసాధారణమైన ఆటగాడు. సాధారణ ఆటగాడు కూడా ఏ లెవల్ క్రికెట్‌లోనైనా తొలి ఏడాది రాణిస్తాడు. కానీ రెండో ఏడాది కూడా అదే జోరు కనబరుస్తూ అంతకు మించి రాణిస్తే.. వారు ప్రత్యేకమైన ప్లేయర్లు. ఎవరినైనా వెనక్కి నెట్టగల సామర్థ్యం ఉన్నవారు'అని జడేజా చెప్పుకొచ్చాడు.

మూడు హాఫ్ సెంచరీలు..

మూడు హాఫ్ సెంచరీలు..

గతేడాది ఐపీఎల్‌లో ఆరంభంలో రాణించిన పృథ్వీ షా.. రెండు హాఫ్ సెంచరీలు చేసిన అనంతరం ఫామ్ కోల్పోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. 14 మ్యాచ్‌ల్లో 228 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 72, 32, 53, 21, 83, 37, 7తో రాణించాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో శివం మావీ వేసిన ఫస్ట్ ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టి ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని కన్నా ముందు అజింక్యా రహానే ఈ ఘనతను అందుకున్నాడు. ఇక కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Story first published: Friday, May 7, 2021, 13:43 [IST]
Other articles published on May 7, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X