న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!

IPL 2021: Aakash Chopra says CSK and RCB were trying to poach Sanju Samson
IPL 2021 : Two Teams Were Trying To Poach Sanju Samson - Aakash Chopra | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2021 సీజన్ మినీ వేలానికి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరపడుతున్న వేళ.. ఫ్రాంచైజీలన్నీ తమ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై దృష్టిసారించాయి..! ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో పాటు... డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లకు ప్రమోషన్లూ ఇస్తున్నాయి..! నైపుణ్యం ఉన్నా.. అవకాశాలు ఇవ్వలేని ప్లేయర్లను వేలంలోకి పంపించడంతో పాటు అవసరం వస్తారనుకున్న క్రికెటర్ల కోసం మరోసారి కోట్లు వెచ్చించేందుకు రెడీ అవుతున్నాయి..! ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బడ్జెట్, లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కుర్రాళ్ల వేటలో పడ్డాయి..! గత బుధవారమే ఫ్రాంచైజీలన్నీ తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి.

స్మిత్‌కు అంత సీన్ లేదు..

స్మిత్‌కు అంత సీన్ లేదు..

'చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు సంజూ శాంసన్‌ను తీసుకోవడానికి ప్రయత్నించాయని నా దృష్టికి వచ్చింది. ఈ రెండు ఫ్రాంచైజీలు సంప్రదించిన తరువాతే రాజస్థాన్ రాయల్స్ కూడా సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకోవడమే కాకుండా జట్టులో అతని స్థాయిని పెంచాలని భావించింది. అందుకే శాంసన్‌ను తమ సారథిగా ప్రకటించింది. విదేశీ ఆటగాళ్లను కెప్టెన్లుగా ఉంచే పద్దతికి నేను వ్యతిరేకం. ఇక స్టీవ్ స్మిత్‌ను వదులుకొని రాజస్థాన్ రాయల్స్ మంచి పనిచేసింది. అతనికి రూ.12.5 కోట్లు దండుగ. తాజా వేలంలో అతని కోసం ఇంతకంటే ఎక్కువ వెచ్చిస్తే అంతకంటే పిచ్చి పని మరేది ఉండదు.'అని చోప్రా చెప్పుకొచ్చాడు.

రాజస్థాన్ తప్పు చేసింది..

రాజస్థాన్ తప్పు చేసింది..

ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ రాజస్థాన్ రాయల్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సంజూ శాంసన్‌ను కాకుండా బట్లర్‌ను కెప్టెన్ చేయాల్సిందన్నాడు. 'ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ శాంసన్‌ను కెప్టెన్ చేయడం సమంజసం కాదు. ఇప్పుడిప్పుడే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. నేనే కానీ రాయల్స్ మేనేజ్‌మెంట్‌లో ఉంటే జోస్ బట్లర్‌ను కెప్టెన్ చేసేవాడిని. శాంసన్‌కు వైస్ కెప్టెన్సీ ఇచ్చేవాడిని. అతని కెరీర్‌కు ఈ సీజన్ ఎంతో ముఖ్యం. ఇప్పటికే అతనిపై అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడి ఉంది. ఈ సీజన్‌లో రాణించకుంటే భారత జట్టులో అతని స్థానాన్ని సుస్థిరం చేసుకోలేడు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

క్యాష్ డీల్స్ సమంజసమేనా..?

క్యాష్ డీల్స్ సమంజసమేనా..?

ఇక ఆల్ క్యాష్ డీల్స్ కింద రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన రాబిన్ ఊతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 3 కోట్లకు బదిలీ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆల్ క్యాష్ డీల్స్ సమంజమేనా? అని ఆకాశ్ చోప్రా ట్విటర్ వేదికగా అభిమానులను ప్రశ్నించాడు. 'ఆటగాళ్ల బదిలీల విషయంలో ఈ క్యాష్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నా. ఆటగాడి అధికారిక ఫీజే టీమ్ పర్స్ నుంచి తీసివేస్తారనుకుంటున్నా. ఇదే నిజమైతే ఇది సమంజసమా? మీ అభిప్రాయం ఏంటి?'అని చోప్రా అభిమానులను ప్రశ్నించాడు.

 రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ లిస్ట్..

రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ లిస్ట్..

రిటైన్ ప్లేయర్లు: సంజూ శాంసన్ (కెప్టెన్), మనన్ వొహ్రా, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, అనుజ్ రావత్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే

వదులుకున్న ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఓషానే థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్,

Story first published: Friday, January 22, 2021, 18:43 [IST]
Other articles published on Jan 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X