న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎమ్మెస్కే ప్రసాద్ ఎక్కడా? తెలుగు కామెంట్రీ చెప్పడం లేదే? రాయుడు ఆటకు భయపడ్డాడా?

IPL 2020: Why no MSK Prasad in Telugu commentary box?
CSK VS MI : MSK Prasad, Kohli Slammed By Fans After Ambati Rayudu's Stunning Knock || Oneindia

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలుగు కామెంట్రీ చెబుతున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం నుంచి తనదైన కామెంట్రీతో అలరించిన ఎమ్మెస్కే అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఆటను ప్రశంసిస్తూ అతను చెప్పిన కామెంట్రీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే రాయుడు ఆడినప్పుడల్లా ఎమ్మెస్కే ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే గత కొన్ని మ్యాచ్‌లుగా ఎమ్మెస్కే తెలుగు కామ్‌బాక్స్‌లో కనిపించడం లేదు. టీమిండియా మాజీ క్రికెటర్లు వేణుగోపాల్ రావు, వెంకటపతి రాజు, మాజీ ఐపీఎల్ ప్లేయర్స్ ఆశిష్ రెడ్డి, కౌశిక్, కళ్యాణ్ కృష్ణాలే కామెంట్ చెబుతున్నారు.

ఎమ్కెస్కే ఎక్కడా?

ఎమ్కెస్కే ఎక్కడా?

ఇలా ఉన్న పళంగా ఎమ్మెస్కే తప్పుకోవడంతో ఎమ్కెస్కే ఎక్కడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ వేదికగా #starniaduguలో స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానెల్‌ను నిలదీస్తున్నారు. ఎందుకు కామెంట్రీ చెప్పడం లేదని అడుగుతున్నారు. అయితే ఎవరూ ఎమ్మెస్కే కామ్ బాక్స్‌లో కనిపించకపోవడానికి గల కారణాన్ని చెప్పడంలేదు. దీంతో అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంబటి రాయుడు ఆటను చూడలేకనే ఎమ్మెస్కే కామెంట్రీ చెప్పడం లేదని ఒకరంటే.. రాయుడు అభిమానుల ట్రోలింగ్ తట్టుకోలేక ఎమ్మెస్కే పారిపోయాడని కామెంట్ చేస్తున్నారు.

త్రీడీ వివాదం..

త్రీడీ వివాదం..

ఇక భారత వన్డే ప్రపంచకప్ జట్టులో అంబటి రాయుడిని ఎంపిక చేయకుండా వేటు వేసాడని ఎమ్మెస్కేపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ తప్పిదం కారణంగా భారత్ ప్రపంచకప్ గెలవలేకపోయిందనేది వారి అభిప్రాయం. ఇక గతేడాది ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో ఉన్న రాయుడికి ఆఖరి క్షణంలో మొండి చెయ్యి ఎదురైన విషయం తెలిసిందే. అతన్ని పక్కన పెట్టి త్రీడీ ఆటగాడంటూ విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీనిపై రాయుడు బాహాటంగానే విమర్శలు గుప్పించాడు. త్రీడీ గ్లాసెస్‌లో ఆటను చూస్తానని సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. దాంతో రాయుడు ప్రస్తావన ఎత్తినప్పుడల్లా అభిమానులు ఎమ్మెస్కేపై ట్రోలింగ్‌కు దిగారు.

తడబడ్డా.. ఆకట్టుకున్న ఎమ్మెస్కే..

తడబడ్డా.. ఆకట్టుకున్న ఎమ్మెస్కే..

ఆరంభంలో తెలుగులో కామెంట్రీ చెప్పడానికి ఎమ్మెస్కే ఇబ్బంది పడ్డా.. తర్వాత చాలా మెరుగయ్యాడు. తనదైన వ్యాఖ్యానంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా ఉన్న అనుభవంతో ప్రతీ ఆటగాడి గురించి అద్భుతంగా విశ్లేషించాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్ల సామర్థ్యాలు, బలహీనతలను తెలుగు ప్రేక్షకులకు తెలియజేశాడు. మ్యాచ్ అనంతరం జట్ల ఓటమికి గల కారణాలను కూడా అద్భుతంగా విశ్లేషించాడు. కానీ గత కొన్ని రోజులుగా కామెంట్రీ బాక్స్‌‌లో కనిపించడం లేదు. ఎమ్మెస్కేనే తప్పుకున్నాడా? లేక తప్పించారా? అనే విషయంపై క్లారిటీ లేదు.

పీటర్సన్‌లానే తప్పుకున్నాడా?

పీటర్సన్‌లానే తప్పుకున్నాడా?

ఇంగ్లీ కామ్ బాక్స్ నుంచి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్ ఉన్నపళంగా తప్పుకున్నవిషయం తెలిసిందే. లీగ్‌ను వదిలి గత శుక్రవారమే తిరిగి లండన్‌ చేరుకున్నాడు. పిల్లలతో కలిసి సమయం గడపడం కోసమే అర్ధాంతరంగా ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నాని కెవిన్ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా యూకేలో విద్యాసంస్థల సెలవులు పొడిగించడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఎమ్మెస్కే కూడా వ్యక్తిగత పనుల నేపథ్యంలోనే తెలుగు కామ్ బాక్స్ నుంచి తప్పుకొని ఉంటాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Story first published: Monday, October 19, 2020, 11:00 [IST]
Other articles published on Oct 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X