న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క తప్పు టోర్నీ మొత్తాన్ని దెబ్బతీస్తుంది.. టీమ్‌‌మేట్స్‌‌కు కోహ్లీ వార్నింగ్‌‌

IPL 2020: Virat Kohli Warns Team Members One Mistake Could Spoil Whole Tournament

దుబాయ్‌‌: ఎవరో ఒక్క ఆటగాడు చేసిన చిన్న తప్పు టోర్నీ మొత్తాన్ని నాశనం ‌చేయగలదని రాయల్‌‌ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన టీమ్‌మేట్స్‌ను హెచ్చరించాడు. బయో బబుల్‌‌ను సురక్షితంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ఈ మేరకు సోమవారం జరిగిన ఆర్సీబీ తొలి ఆన్‌లైన్ ‌మీటింగ్‌‌లోనే సహచర ఆటగాళ్లకు కోహ్లీ స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. కరోనా నేపథ్యంలో ఆతిథ్య యూఏఈ అధికారులు అమలు చేస్తున్న నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నాడు.

తీవ్ర పరిణామాలు..

‘కరోనా కారణంగా ప్రస్తుతం విధించిన కఠినమైన నిబంధలను పాటించడంలో ఎవరూ ఉదాసీనతకు తావు ఇవ్వరాదు. పొరపాటున ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జట్టు నుంచి తొలగించడంతో పాటు వారం రోజులు క్వారంటైన్‌కు పంపిస్తాం. నెగెటివ్‌ వచ్చాకే మళ్లీ రానిస్తాం. అదే ఎవరైనా కావాలని నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటగాళ్లు ఈ చర్యలు అంగీకారమంటూ ముందే సంతకం చేయాల్సి ఉంటుంది' అని కోహ్లి కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి..

ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి..

‘ఇప్పటిదాకా మనకు ఏం చెప్పారో దాన్ని పాటించాం. ఇప్పుడు బయో బబుల్‌ ‌విషయంలోనూ అలాగే బాధ్యతగా ఉంటారని ఆశిస్తున్నా. ఈ విషయంలో రాజీపడరని అనుకుంటున్నా. ఎందుకంటే మనలో ఎవరైనా ఒక్క తప్పు చేసినా అది టోర్నీ మొత్తాన్ని నాశనం‌ చేయగలదు. అలా జరగాలని మనలో ఎవ్వరూ కోరుకోవడం లేదు. కాబట్టి బయో బబుల్‌‌ను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి' అని విరాట్‌ స్పష్టం చేశాడు.

మంచి సంప్రదాయం..

మంచి సంప్రదాయం..

అలాగే, తొలి రోజు నుంచే జట్టు కల్చర్ డెవలప్‌ చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ‘తొలిరోజు ప్రాక్టీస్‌‌ కోసం ఇంకా ఎదురు చూడలేకపోతున్నా. దాని కోసం మనమంతా ఉత్సాహంగా ఉన్నాం. తొలి రోజు నుంచే జట్టులో మంచి సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు ఇదో అవకాశం. నా వరకైతే జట్టులో ప్రతి ఒక్కరూ సమంగా భావించే, ప్రతి ఒక్కరూ సమాన బాధ్యత వహించే వాతావరణాన్ని క్రియేట్‌ చేయాలనుకుంటున్నా. మనం నాణ్యమైన క్రికెట్‌ ఆడాలి. దాని కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఫస్ట్‌ ‌సీనియర్లు ముందడుగు వేయాలి' అని కోహ్లీ పేర్కొన్నాడు.

రూల్స్ అధిగమిస్తే..

రూల్స్ అధిగమిస్తే..

ఇక, బయో బబుల్‌‌ దాటితే ఎదుర్కొనే కఠిన చర్యల గురించి టీమ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్ మైక్‌ హేసన్‌ ప్లేయర్లకు వివరించారు. హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ కూడా పాల్గొన్న ఈ మీటింగ్‌ ‌వీడియోను ఆర్‌సీబీ టీమ్‌ ట్విట్టర్ లో షేర్ చేసింది. సెప్టెంబరు నెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం దాదాపు జట్లన్నీ ఇప్పటికే యూఏఈ వెళ్లిపోయాయి. కరోనా కారణంగా ఆటగాళ్లందరినీ బయో బబుల్స్‌లో ఉంచుతున్నారు. మ్యాచులు కూడా ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తారు.

కోహ్లీ ఎవడైతే నాకేంటి.. ఎవడు నాపై ఆధిపత్యం చెలాయించవద్దు: విండీస్ పేసర్

Story first published: Tuesday, August 25, 2020, 9:39 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X