న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఎవడైతే నాకేంటి.. ఎవడు నాపై ఆధిపత్యం చెలాయించవద్దు: విండీస్ పేసర్

I don’t care who he is, Kesrick Williams on his on-field banter with Virat Kohli

న్యూఢిల్లీ: క్రికెట్‌లో 'నోట్‌బుక్ సెలెబ్రేషన్'అందరికి బాగా తెలిసిందే. తమదైన శైలిలో ఆనందం వ్యక్తం చేసే వెస్టిండీస్ ఆటగాళ్లలో అదొక బౌలర్ సెలెబ్రేషన్ స్టైల్. ఆ జట్టులో ఒకరు సెల్యూట్‌తో సెలెబ్రేషన్ చేసుకుంటే మరొకరు చిందేస్తారు. ఇంకొకరు ఎవేవో సైగలు చేస్తూంటారు. ఈ నేపథ్యంలోనే విండీస్ పేసర్ కెస్రిక్ విలియమ్స్ ప్రత్యర్థి వికెట్ తీసిన ఆనందంలో నోట్ బుక్ సెలెబ్రేషన్ చేసుకుంటాడు. బుక్‌లో ఏదో రాస్తున్నట్లు సైగ చేస్తాడు.

 కోహ్లీ నోట్ బుక్ సెలెబ్రేషన్స్..

కోహ్లీ నోట్ బుక్ సెలెబ్రేషన్స్..

అయితే గతేడాది ఈ సెలెబ్రేషన్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టి సమాధానమే ఇచ్చాడు. 2017 విండీస్ పర్యటనలో కోహ్లీని ఔట్ చేసిన కెస్రిక్ విలియమ్స్ ఇదే స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. దీన్ని గుర్తు పెట్టుకున్న కోహ్లీ.. గతేడాది విండీస్ భారత పర్యటనకు రాగా.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టీ20లో బదులిచ్చాడు. ఆ మ్యాచ్‌లో విలియమ్స్‌ బౌలింగ్‌ను టార్గెట్ చేసి మరి ఆడిన విరాట్.. అతని తలపై నుంచి నేరుగా ఓ బంతిని బౌండరీకి తరలించాడు. ఆ వెంటనే లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టి అదే నోట్ బుక్ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సైగలు చేశాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లోనే 94 రన్స్‌తో జట్టును గెలిపించాడు.

దెబ్బకు నిశబ్ద సంబరాలు..

దెబ్బకు నిశబ్ద సంబరాలు..

ఇక తిరువనంతపురం వేదికగా జరిగిన ఆ మరుసటి టీ20లోనే విలియమ్స్.. విరాట్‌ను ఔట్ చేశాడు. కానీ నోట్ బుక్ సెలెబ్రేషన్స్ చేసుకోకుండా.. కొత్తగా నోటిపై వేలు వేసుకుంటూ నిశబ్ద సంబరాలు చేసుకున్నాడు. అయితే అప్పట్లో విరాట్‌కు విలియమ్స్ భయపడే అలా చేశాడని భారత అభిమానులు కామెంట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెస్రిక్ స్పందించాడు.

అవాక్కయ్యా..

అవాక్కయ్యా..

‘నా తరహాలో కోహ్లీ సెలెబ్రేట్ చేసుకోవడం చూసి అవాక్కయ్యా.. నిజంగా ఆశ్చర్యపోయా. నేను 2017లో అతని ముందు ఇలా చేశా. దాన్ని విరాట్ 2019 వరకు గుర్తుంచుకున్నాడు. అతనెలాంటి కసి ఉన్న ఆటగాడో ఇదే తెలియజేస్తుంది. హైదరాబాద్‌లో అతని కవ్వింపులకు నేను ఇచ్చిన సమాధానం మీ అందరికి తెలిసిందే. ఆ సంఘటన అనంతరం నాపై ఎవ్వడూ అలా ఆధిపత్యం చెలాయించవద్దని గట్టిగా నిర్ణయించుకున్నా. అతనికి గట్టిగా బదులివ్వాలనుకున్నా. అనుకున్నట్లే రెండో మ్యాచ్‌లోనే అతన్ని ఔట్ చేశా.

రెడీగా ఉన్నా..

రెడీగా ఉన్నా..

మరోసారి మా మధ్య ఇలాంటిదే జరుగుతుందనుకుంటున్నా. మేం ఇద్దరం తలపడినప్పుడు ఖచ్చితంగా బదులివ్వడానికి కోహ్లీ ప్రయత్నిస్తాడు. దానికి నేను సిద్దంగా ఉన్నా. కోహ్లీ ఎవరో నాకు అనవసరం. నైపుణ్యం కలిగిన ఆటగాడు కావచ్చు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్లేయర్ కూడా కావొచ్చు. కానీ బౌలర్‌గా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్. కానీ ఓ ఆటగాడిగా అతన్ని ఎప్పుడూ గౌరవిస్తాను.'అని కెస్రిక్ విలియమ్స్ చెప్పుకొచ్చాడు.

నోట్లో గులాబ్‌జామ్‌లు పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నావ్.. రోహిత్ బుగ్గలపై యువీ సెటైర్!

Story first published: Sunday, August 23, 2020, 18:01 [IST]
Other articles published on Aug 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X