న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: అయ్యోరామ.. ఆర్‌సీబీ గెలిచిన అనంతరం కూడా రన్ తీసిన కోహ్లీ (వీడియో)

IPL 2020: Virat Kohli goes for a second run when RCB needing only 1 to win

హైదరాబాద్: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్కోసారి చలాకీగా, మరోసారి దూకుడుగా, ఇంకొసారి గమ్మత్తుగా ప్రవర్తిస్తూ అందర్నీ నవ్విస్తుంటాడు. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ ‌(కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లోనూ కోహ్లీ ఇలాగే చేశాడు. సరదా కోసం చేశాడో లేదా మర్చిపోయి చేయి చేశాడో తెలియదు కానీ కోహ్లీకి సంబందించిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు విషయం ఏటంటే...

ఒక పరుగు బదులు రెండు

కేకేఆర్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ చెదిస్తోంది. 13వ ఓవర్ల తర్వాత బెంగళూరు విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ప్రసిద్ క్రిష్ణ వేసిన 14వ ఓవర్‌ తొలి బంతికి విరాట్ కోహ్లీ 2 పరుగులు తీశాడు. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. రెండో బంతి యార్కర్ పడగా.. పరుగేమి రాలేదు. ఒక పరుగు చేస్తే బెంగళూరు గెలిచినట్లే. అయితే మూడో బంతిని ఎదుర్కొన్న కోహ్లీ.. కీపర్ వెనకాలకు షాట్ ఆడాడు. ఒక పరుగు పూర్తి చేసిన కోహ్లీ.. మరో పరుగు కోసం పరుగులు పెట్టాడు. అవతలి బ్యాట్స్‌మన్‌ గుర్‌కీరత్‌మన్‌ సింగ్‌ కూడా పరుగు తీశాడు.

మరిపోయావా కోహ్లీ

మరిపోయావా కోహ్లీ

విరాట్ కోహ్లీ తీసిన రెండో పరుగుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'మిడిల్ స్టంప్' ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కావాల్సింది ఒక్క పరుగే కదా..? స్కోర్లు సమం అయిన విషయం మరిపోయావా విరాట్ కోహ్లీ' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'ఆర్‌సీబీ గెలిచిన అనంతరం కూడా రన్ తీసిన కోహ్లీ' అని మరో అభిమాని ట్వీట్ చేశాడు. 'రన్‌ మెషీన్‌కు పరుగులు తీయడమంటే చాలా ఇష్టం కాదా', 'అయ్యోరామ.. గెలిచాక కూడా కోహ్లీ పరుగు ఆపడం లేదు' అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

లాంఛనం పూర్తి చేసిన కోహ్లీ

లాంఛనం పూర్తి చేసిన కోహ్లీ

బుధవారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మహ్మద్‌ సిరాజ్‌ దెబ్బకు ఇయాన్ మోర్గాన్‌ (34 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్‌ తొలి వికెట్‌కు 38 బంతుల్లో 46 పరుగులు జోడించారు. వీరిద్దరు ఒకే స్కోరు వద్ద అవుటైనా.. గుర్‌కీరత్‌ (26 బంతుల్లో 21 నాటౌట్‌; 4 ఫోర్లు), కోహ్లీ (17 బంతుల్లో 18 నాటౌట్‌; 2 ఫోర్లు) కలిసి మిగతా లాంఛనం పూర్తి చేశారు.

టైటిల్‌ ఫేవరెట్‌గా

టైటిల్‌ ఫేవరెట్‌గా

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుస విజయాలతో దూసుకుపోతూ టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది. విరాట్‌ కోహ్లీ ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో విరాట్ 10 మ్యాచ్‌ల్లో 365 పరుగులతో ఆ జట్టు తరపున​ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. ఇప్పటికే 10 మ్యాచ్‌లాడిన ఆర్‌సీబీ 7 విజయాలు, 3 ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ సీఎస్‌కేతో అక్టోబర్ 25న తలపడనుంది.

RR vs SRH: రాజస్థాన్‌తో సన్‌రైజర్స్‌ ఢీ.. విలియమ్సన్‌ డౌటే.. ఓడితే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఔట్!!

Story first published: Thursday, October 22, 2020, 18:48 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X