న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs SRH: రాజస్థాన్‌తో సన్‌రైజర్స్‌ ఢీ.. విలియమ్సన్‌ డౌటే.. ఓడితే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఔట్!!

IPL 2020, RR vs SRH Preview: Match Prediction, Playing XI, Pitch Report, Teams focus on play-offs

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌-13లో మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ రోజు రాత్రి దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ తలపడనుంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రెండు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌ వైపు అడుగెస్తే.. ఓడిన జట్టు మాత్రం ఇంటిముఖం పట్టే అవకాశం ఉంది. వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌సేన అసమాన్య ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

ఆశలన్నీ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పైనే

ఆశలన్నీ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పైనే

గత సీజన్‌లో బ్యాటింగ్‌తో రాణించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈసారి విభాగంలోనే తేలిపోతోంది. చిన్న లక్ష్యాలను కూడా ఛేదించలేక ఓటములను చవిచూస్తోంది. గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా.. సూపర్‌ ఓవర్‌లో మంచి హిట్టర్‌ లేని కారణంగా ఓటమి పాలైంది. వార్నర్, బెయిర్‌స్టో, పాండే చెలరేగాల్సిన అవసరం ఉంది. గార్గ్, శంకర్ ఫామ్ అందుకోవాలి. ఇప్పటికే బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్న హైదరాబాద్‌కు కేన్ విలియమ్సన్‌ గాయం కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్‌ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అతని స్థానంలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌ను తీసుకోవచ్చు. బౌలింగ్‌లో రషీద్ ‌ఖాన్‌, టీ నటరాజన్‌ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం.

బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమి లేవు

బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమి లేవు

గత మ్యాచ్ గెలుపుతో రాజస్థాన్‌లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. జోస్ బట్లర్‌ ఫామ్‌లోకి రావడంతో ఆ జట్టు మరింత బలంగా తయారైంది. స్మిత్‌ కూడా కెప్టెన్‌ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సంజు శాంసన్‌ ఓ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. రాహుల్ తెవాటియా ముగింపు ఇస్తున్నాడు. అయితే భారీ అంచనాలతో జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్ తనస్థాయి ప్రదర్శన ఇవ్వలేదు.‌ ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు. రాజస్థాన్‌కు బౌలింగ్‌లో పెద్ద సమస్యలేమి కనిపించడం లేదు.

రాజస్థాన్‌కు చెత్త రికార్డు

రాజస్థాన్‌కు చెత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో ఆరేసి విజయాలు నమోదు చేశాయి. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాజస్థాన్‌ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ మైదానంలో రాజస్థాన్‌కు చెత్త రికార్డు ఉంది. 5 మ్యాచులాడి నాలుగింట్లో ఓడింది. ఇక్కడ ఆడిన మ్యాచుల్లో హైదరాబాద్‌ ఏడింట్లో నాలుగు గెలిచింది. దుబాయ్‌ పిచ్‌ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఛేదన జట్టు కష్టపడాల్సి రావచ్చు. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు 160-170పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే పోరాడే అవకాశం ఉంటుంది.

IPL 2020 : David Warner Upset On Sunrisers Hyderabad Super Over Loss | SRH Vs KKR | Oneindia Telugu
జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

రాజస్థాన్: రాబిన్‌ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్​ గోపాల్, అంకిత్‌ రాజ్‌పుత్‌, కార్తిక్​ త్యాగి.

హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, మనీశ్ ‌పాండే, కేన్ విలియమ్సన్‌/జాసన్ హోల్డర్‌, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్.

KXIP: పంజాబ్‌ హ్యాట్రిక్‌.. గేల్‌కు స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చిన ప్రీతి జింటా (వీడియో)

Story first published: Thursday, October 22, 2020, 17:46 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X