న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పంజాబ్ చేతిలో ఆర్‌సీబీ ఓటమికి కోహ్లీ చెత్త కెప్టెన్సీనే కారణమా?

 IPL 2020: Virat Kohli fails again, furious fans call out RCB captain

హైదరాబాద్: మంచి ఆటగాడు గొప్ప సారథి కాలేడు అనడానికి అంతర్జాతీయ క్రికెట్‌లో బోలెడన్నీ ఉదహారణలున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో పరుగుల వరద పారించినా టీమిండియా సారథిగా సక్సెస్ కాలేకపోయాడు. వ్యక్తిగతంగా వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అనిపించుకున్నా సారథిగా జట్టుకు విజయాలందించలేకపోయాడు. ఇప్పుడు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే జాబితాలో చేరుతాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఈ కారణంగానే విరాట్ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా అందించలేదనే విమర్శ కూడా ఉంది. వ్యక్తిగతంగా క్లాస్ ఇన్నింగ్స్‌లతో దుమ్ములేపుతున్న విరాట్.. కెప్టెన్సీలో మాత్రం విఫలమవుతున్నాడు. ముఖ్యంగా మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి.

 కీలక సమయంలో సిరాజ్‌తో..

కీలక సమయంలో సిరాజ్‌తో..

తాజాగా కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా విరాట్ కెప్టెన్‌గా విఫలమయ్యాడు. ముఖ్యంగా బౌలింగ్ రొటేషన్ విషయంలో అనేక తప్పిదాలు చేసి జట్టు ఓటమికి కారణమయ్యాడు. పవర్ ప్లేలో సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు డేంజరస్‌గా మారిన వాషింగ్టన్ సుంధర్‌కు తొలి 6 ఓవర్ల పాటు బంతిని ఇవ్వలేదు. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ విజయానికి 47 పరుగులు అవసరమైన దశలో 16వ ఓవర్ మహ్మద్ సిరాజ్‌కు ఇచ్చి ఘోర తప్పిదం చేశాడు. అప్పటికే అతను ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ ఓవర్‌ను ఇసురు ఉడానాతో వేయిస్తే ఫలితం మరోలా ఉండేది. ఆ ఓవర్లో సిరాజ్ 20 పరుగులిచ్చాడు.

 తప్పు మీద తప్పు..

తప్పు మీద తప్పు..

ఆ తర్వాత కూడా మళ్లీ సుంధర్‌కు బౌలింగ్‌ ఇచ్చి కోహ్లీ తప్పు మీద తప్పు చేశాడు. ఇక్కడ మోరిస్ లేక ఉడానాతో బౌలింగ్ చేయించి ఉన్నా పంజాబ్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి నెలకొనేది. అంతేకాకుండా మంచి లెంగ్త్‌తో బౌలింగ్ చేసే ఉడానాతో కాకుండా సిరాజ్‌తో మూడు ఓవర్లు వేయించి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఉడానా రెండు ఓవర్లే బౌలింగ్ చేయగా... చాహల్ మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇదే కోహ్లీ గందరగోళ కెప్టెన్సీని తెలియజేస్తుంది. గేల్‌ బ్యాటింగ్‌కు దిగిన తర్వాత చాహల్‌కు కోహ్లీ బౌలింగ్ ఇవ్వలేదు. ఆఖరి ఓవర్లో 2 పరుగులు చేస్తే పంజాబ్ గెలుస్తుందనగా.. చాహల్‌‌ను బౌలింగ్‌కు దింపాడు. అతను అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికి పూరన్ ఆఖరి బంతికి విజయాన్నందించాడు. దాంతో కోహ్లీ కెప్టెన్సీపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.

కొంపముంచిన లెఫ్ట్ రైట్ వ్యూహం..

కొంపముంచిన లెఫ్ట్ రైట్ వ్యూహం..

ఇక ఆర్‌సీబీ ప్రధాన బలం టాప్ ఆర్డర్ బ్యాటింగ్. పడిక్కల్, ఫించ్ ఓపెనర్లుగా బరిలో దిగితే.. తర్వాత కోహ్లీ, డివిలియర్స్ క్రీజ్‌లోకి వస్తారు. కానీ పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు డివిలియర్స్‌ను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపి మూల్యం చెల్లించుకుంది. మణికట్టు స్పిన్నర్లను డివిలియర్స్ సరిగా ఎదుర్కోలేడని భావనతోపాటు.. లెఫ్ట్ రైట్ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆఖరి ఓవర్లలో ఏబీడీ చెలరేగుతాడని భావించారు. కానీ క్రీజులో కుదురుకోవడానికి సమయం ఉండదనే లాజిక్ మిస్సయ్యారు.

లోయర్ ఆర్డర్‌లో ఆడిన డివిలియర్స్ భారీ షాట్లు ఆడాలనే ఒత్తిడితో పేలవ షాట్‌తో పెవిలియన్ చేరాడు.

ఆఖరి బంతి వరకు...

ఆఖరి బంతి వరకు...

టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లీ (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్‌ (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రాహుల్‌ (49 బంతుల్లో 61 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్‌ (45 బంతుల్లో 53; 1 ఫోర్‌ 5 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు.

ప్రీతీ జింటా టీమ్ గెలిచిందా? సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్!

Story first published: Friday, October 16, 2020, 17:59 [IST]
Other articles published on Oct 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X