న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రీతీ జింటా టీమ్ గెలిచిందా? సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్!

Salman Khan’s old tweet goes viral after KXIP pulled off an absolute thriller against RCB

ఐపీఎల్‌లో అట్టడుగున నిలిచిన జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌. గెలిచే మ్యాచ్‌ల్ని ఓడిన జట్టు కూడా అదే! రెండొందల పైచిలుకు స్కోరు చేసినా పరాజయాన్ని పలకరించిన జట్టు కింగ్స్‌ ఎలెవనే. ఇలాంటి జట్టు ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఏడింట ఒకే ఒక మ్యాచ్‌ గెలిచింది. అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపైనే! ఇప్పుడు కూడా ఐదు వరుస పరాజయాల తర్వాత మళ్లీ అదే బెంగళూరుపైనే గెలిచి హమ్మయ్య గెలిచామనిపించింది. కింగ్స్‌ ఎలెవన్‌ అభిమానుల్ని ఊరటనిచ్చింది. లీగ్‌లో ముందడుగు వేసే అవకాశాల్ని సజీవంగా నిలుపుకుంది. దాంతో ఈ జట్టు ఆటతీరుపై నెట్టింట జోకులు పేలుతున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓల్డ్ ట్వీట్ ను గుర్తు చేస్తూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

2014 ఐపీఎల్ ఫైనల్ తర్వాత..

2014 ఫైనల్ తర్వాత సల్మాన్ ఖాన్ పంజాబ్ కో ఓనర్ అయిన ప్రీతీ జింటాను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఆ సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓడింది. ఆ ఫలితంపై సల్మాన్.. ‘జింటా టీమ్ గెలిచిందా'అని ట్వీటర్ వేదికగా ప్రశ్నించాడు. ఇక గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా పంజాబ్ గెలిచే మ్యాచ్ ను ఆఖరి బంతి వరకు తీసుకొచ్చి ఊపీరి పీల్చుకుంది. దాంతో సల్మాన్ ట్వీట్‌ను గుర్తు చేసుకున్న నెటిజన్లు మరోసారి ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ పన్నీ కామెంట్ చేస్తున్నారు. చివరకు పంజాబ్ గెలిచింది బ్రో అని ఒకరంటే.. రెండు గెలిచింది ఆ రెండు బెంగళూరుపైనే అని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

గుండెపోటుకు గురి చేయబోదు..

ఆర్సీబీతో పంజాబ్ గెలవడంపై ప్రీతీ జింటా తనదైన శైలిలో స్పందించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకున్నామని, కానీ గుండె పోటు వచ్చేలా ఉన్నా ఇలాంటి పరిస్థితులు పునరావృతం చేయవద్దని తమ టీమ్ ఆటగాళ్లను హెచ్చరించింది. ‘తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుత విజయాన్నందుకున్నాం. క్రికెట్ పేరుతో తమ జట్టు ఎవరికీ గుండెపోటుకు గురి చేయదని ఆశిస్తున్నా. ఇలాంటి పరిస్తితులను తీసుకురావద్దని కూడా పంజాబ్ టీమ్ ను హెచ్చరిస్తున్నా. ఆర్‌సీబీ బౌలర్ల పోరాట నన్ను విపరీతంగా ఆకట్టుకుంది'అని ఈ సొట్ట బుగ్గుల సుందరి ట్వీట్ చేసింది.

ప్లే ఆఫ్ ఆశలు సజీవం..

ప్లే ఆఫ్ ఆశలు సజీవం..

ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. కోహ్లి (39 బంతుల్లో 48; 3 ఫోర్లు) రాణించగా... మోరిస్‌ (8 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరిపించాడు. తర్వాత కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రాహుల్‌ (49 బంతుల్లో 61 నాటౌట్‌; 1 ఫోర్, 5 సిక్సర్లు), గేల్‌ (45 బంతుల్లో 53; 1 ఫోర్‌ 5 సిక్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌ (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఈ గెలుపు పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలకు ఊపిరిపోసింది.

MI vs KKR: కెప్టెన్సీ మార్పుతో కోల్‌కతా రాత మారెనా? ముంబై జోరుకు బ్రేక్‌లు వేసెనా? తుది జట్లు ఇవే

Story first published: Friday, October 16, 2020, 16:17 [IST]
Other articles published on Oct 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X