న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండు బౌన్సర్లు.. అదనపు ఓవర్.. ఈ మార్పులు చేస్తే టీ20‌లు అదిరిపోతాయి: గవాస్కర్

IPL 2020: Sunil Gavaskar Suggests New Rules For T20 Cricket
IPL 2020 : Sunil Gavaskar Suggests New Rules For T20 Cricket || Oneindia Telugu

దుబాయ్: టీ20 ఫార్మాట్‌లో పూర్తిగా బ్యాట్స్‌మన్‌దే ఆధిపత్యం. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒక్కోసారి బ్యాట్స్‌మన్ ఓవర్లోని ఆరు బంతులను సిక్సులుగా కొట్టగలడు. లేదా ఒకే ఓవర్లో 20 పరుగులకు పైగా కూడా బాదగలడు. ఇక్కడ బలిపశువు బౌలర్ మాత్రమే. టీ20లో అరుదుగా మాత్రమే బౌలర్ రాణించిన సందర్భాలు ఉంటాయి. అయితే బంతి, బ్యాట్ మధ్య సమతూకం రావాలంటే.. కొన్ని మార్పులు కచ్చితంగా చేయాలని టీమిండియా మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్‌ సునీల్ గవాస్కర్ అంటున్నాడు‌.

టీ20ని మార్చండి

టీ20ని మార్చండి

ముఖ్యంగా పేస్‌ బౌలర్‌కు ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే నిబంధనను టీ20 ఫార్మాట్‌లో జత చేర్చాలని సునీల్ గవాస్కర్ అన్నాడు. బౌండరీలే లక్ష్యంగా బ్యాట్స్‌మెన్‌ విరుచుకుపడే టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకూ ఉన్న ఒక బౌన్సర్‌ను రెండుగా మార్చాలన్నాడు. ఇక బౌండరీ లైన్‌ దూరాన్ని కూడా పెంచాలన్నాడు. చిన్న గ్రౌండ్‌లలో బౌండరీ లైన్‌ దూరం తగ్గుతుందనే విషయాన్ని గవాస్కర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అలా కాకుండా టీ20ల్లో అన్ని మ్యాచ్‌లకు ఒకే తరహా బౌండరీ లైన్‌ను ఏర్పాటు చేయాలని, అది గరిష్టంగా ఇంత ఉండాలని నియమాన్ని తీసుకురావాలన్నాడు. అప్పుడే బౌలర్‌పై ఒత్తిడి తగ్గి బ్యాటింగ్‌, బౌలింగ్‌ మధ్య సమ పోరు నడుస్తుందని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

రెండు బౌన్సర్లు ఇవ్వాలి

రెండు బౌన్సర్లు ఇవ్వాలి

ఐపీఎల్ 2020 కోసం సునీల్ గవాస్కర్ ప్రస్తుతం యూఏఈలో ఉన్నాడు. తాజాగా సన్నీ పీటీఐతో మాట్లాడుతూ... 'టీ20లు బ్యాట్స్‌మెన్‌ ఫార్మాట్‌. కాబట్టి ఫాస్ట్‌ బౌలర్లకు ఓవర్‌కు రెండు బౌన్సర్లు ఇవ్వాలి. దీంతో బౌలర్ కూడా ఆధిపత్యం చెలాయించవచ్చు. గ్రౌండ్‌ అథారిటి కోరుకుంటే.. బౌండరీ లైన్‌ను పెద్దది చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటివరకూ ఒక బౌలర్‌కు నాలుగు ఓవర్లు ఉన్న నిబంధనను మారిస్తే బాగుంటుంది. ఒక బౌలర్‌ తన తొలి మూడు ఓవర్లలో ఒక వికెట్‌ తీస్తే.. అతనికి ఎక్స్‌ట్రా ఓవర్‌ను ఇవ్వాలి. సదరు బౌలర్‌ కోటాలో ఐదు ఓవర్లు చేర్చాలి' అని సూచించాడు.

పెనాల్టీ విధించాలి

పెనాల్టీ విధించాలి

'నాన్‌ స్టైకర్‌లో ఉండే ఆటగాడు బౌలర్‌ బంతిని వేయడానికి ముందే క్రీజ్‌ను దాటి బయటకి వెళ్లిపోతున్నాడనే అంశాన్ని పరిశీలించే అధికారం థర్డ్‌ అంపైర్‌కు ఉండాలి. ఇక బౌలర్‌ నాన్‌స్టైకర్‌ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్‌ను మన్కడింగ్‌ చేస్తే.. అది ఔటే కాకుండా పెనాల్టీని కూడా బ్యాట్స్‌మన్‌కు విధించాలి. ఒకవేళ బౌలర్‌ బంతి రిలీజ్‌ చేయకుండానే నాన్‌స్టైకర్‌ బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ను దాటి, ఆ బంతిని అవతలి ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ ఫోర్‌ కొడితే దానికి వన్‌ షార్ట్‌ పెనాల్టీ తీసుకురావాలి' అని సునీల్ గావస్కర్‌ పేర్కొన్నాడు.

షేన్‌ వార్న్ కూడా

షేన్‌ వార్న్ కూడా

టీ20 ఫార్మాట్‌లో ఒక్కో బౌలర్‌ ఐదు ఓవర్లు వేస్తే.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ల మధ్య పోరు సమానంగా ఉంటుంది అని ఇదివరకే ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్‌ వార్న్ సూచించాడు. 'టీ20 ఫార్మాట్‌లో బౌలర్లను కుదించండి. ఐదు బౌలర్లతో 20 ఓవర్ల కోటాను పూర్తి చేసే బదులు నలుగురు బౌలర్లతో ఐదేసి ఓవర్లు వేయించండి. ఈ మార్పు చేసి చూడండి.. బంతి, బ్యాట్ మధ్య సమతూకం ఉంటుంది. పోరు మజాగా మారుతుంది. ఒక బౌలర్‌ ఐదు ఓవర్లు వేయడాన్ని టీ20ల్లో చూడాలనుకుంటున్నా' అని వార్న్ అన్నాడు.

SRH vs KXIP: పంజాబ్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గేల్‌కు వేళాయే.. భువీ స్థానంలో తెలుగు బౌలర్‌!!

Story first published: Thursday, October 8, 2020, 17:31 [IST]
Other articles published on Oct 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X