For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KXIP: పంజాబ్‌తో సన్‌రైజర్స్ ఢీ.. గేల్‌కు వేళాయే.. భువీ స్థానంలో తెలుగు బౌలర్‌!!

IPL 2020, SRH vs KXIP Preview: Playing XI, match prediction, weather forecast, and pitch report

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా ఈరోజు రాత్రి దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. 13వ సీజన్‌లో రెండు జట్లు తలపడడం ఇదే తొలిసారి. ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు విజయాలతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా.. ఐదు మ్యాచులాడి కేవలం ఒకేఒక్క విజయంతో చివరి స్థానంలో పంజాబ్‌ ఉంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో రెండు జట్ల బలాబలాలేంటో ఓసారి చూద్దాం.

కేన్ కూడా రాణిస్తే

కేన్ కూడా రాణిస్తే

తొలి రెండు మ్యాచుల్లో రెండు ఓటములతో సతమతమయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తర్వాత రెండు మ్యాచుల్లో పుంజుకుంది. ఆ తర్వాత ముంబై చేతిలో ఓడిపోయింది. గత మ్యాచ్‌ వరకూ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో ముంబై మ్యాచ్‌లో ఫామ్‌ అందుకున్నాడు. డేవిడ్ వార్నర్, మనీష్ పాండే పరుగులు చేస్తుండం కలిసొచ్చే అంశం. ఇక మిగిలింది కేన్ విలియమ్సన్. అతనొక్కడు రాణిస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత బలంగా మారుతుంది. మరోవైపు మిడిల్ ఆర్డర్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటితే తిరుగుండదు.

పృథ్వీకి ఛాన్స్ వచ్చేనా

పృథ్వీకి ఛాన్స్ వచ్చేనా

సన్‌రైజర్స్ బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించే భువనేశ్వర్‌ కుమార్‌ టోర్నీకి దూరమవడం ఆ జట్టుకు కలవరపెడుతోంది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు కీలక కానుంది. గత మ్యాచ్‌‌లో భువీ స్థానంలో ఆడిన సందీప్ శర్మ, టీ నటరాజన్ ఆకట్టుకున్నారు. సిద్ధార్థ్ కౌల్ మాత్రం భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్, పృథ్వీ రాజ్ యర్రాల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. భువీ లేకపోవడంతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ మరింత కీలకం కానున్నాడు.

గేల్‌కు వేళాయే

గేల్‌కు వేళాయే

సన్‌రైజర్స్ మాదిరిగానే పంజాబ్‌ కూడా బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. పంజాబ్‌ ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ ముందుండుగా.. మయాంక్ మూడో స్థానంలో ఉన్నాడు. నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లు మెరుపు ఇన్నింగ్స్ ఆడట్లేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆకట్టుకోలేదు. దీంతో అతడి స్థానంలో క్రిస్ గేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గేల్ ఆడితే మయాంక్ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు. పంజాబ్ బౌలింగ్‌లో తేలిపోతుంది. మహమ్మద్‌ షమీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. క్రిస్ జొర్డాన్‌ స్థానంలో అఫ్గానిస్థాన్‌ బౌలర్‌ ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక షెల్డన్ కాట్రెల్‌ స్థానంలో మరో పేసర్‌ విల్జోయిన్‌ను తీసుకునే అవకాశాలూ ఉన్నాయి.

భారీ స్కోర్లు:

భారీ స్కోర్లు:

హైదరాబాద్‌, పంజాబ్‌ ఇప్పటి వరకూ 14సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్‌ 10 విజయాలతో ముందంజలో ఉంది. పంజాబ్‌ కేవలం నాలుగింట్లో గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడ్డ గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో హైదరాబాద్‌, రెండింట్లో పంజాబ్‌ గెలిచాయి. ఈ మైదానంలో హైదరాబాద్‌ నాలుగు మ్యాచ్‌లాడి మూడింట్లో విజయం సాధించింది. పంజాబ్‌ కూడా నాలుగు మ్యాచ్‌లాడి రెండింట్లో గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే మైదానంలో గతంలో చెన్నై 178 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ సైతం ప్రత్యర్థి బెంగళూరు ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

జట్లు అంచనా..

జట్లు అంచనా..

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే, కేన్ విలియమ్సన్‌, ప్రియం గార్గ్‌, అభిషేక్‌ శర్మ, అబ్దుల్‌ సమద్‌, రశీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌, సిద్ధార్థ్‌ కౌల్‌/పృథ్వీ రాజ్ యర్రా.

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్ ‌(కెప్టెన్‌), క్రిస్ గేల్, మయాంక్‌ అగర్వాల్‌, మన్‌దీప్ ‌సింగ్‌, నికోలస్‌ పూరన్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మురుగన్‌ అశ్విన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌, రవి బిష్ణోయ్, మహమ్మద్‌ షమీ, షెల్డన్ కాట్రెల్‌/విల్జోయిన్.

ఫించ్‌ను మన్క్‌డింగ్ చేద్దానుకున్నాడు.. కానీ అతడు నాకు మంచి స్నేహితుడు.. బతికిపోయాడు: అశ్విన్‌

Story first published: Thursday, October 8, 2020, 16:45 [IST]
Other articles published on Oct 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+