న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా ఆటగాళ్లకు విజ్ఞప్తి.. టీమిండియాను వదిలేయండి: స్టీవ్ వా

IPL 2020: Steve Waugh says Sledging is not going to worry Virat Kohli

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అంటేనే స్లెడ్జింగ్‌కు మారుపేరు. ఆసీస్‌ ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లపై స్లెడ్జింగ్‌కు పాల్పడి.. మానసికంగా వారిని దెబ్బతీసేవారు. 2000వ సంవత్సరం నుంచి 2012 వరకు ఆసీస్‌ తిరుగులేని జట్టుగా ఉన్నప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లపై కవ్వింపు చర్యలకు పాల్పడి మ్యాచులో సగం విజయం సాధించేవారు.

ఆండ్రూ సైమండ్స్‌- హర్బజన్‌ సింగ్ మంకీగేట్‌ వివాదం ఈ కోవకు చెందినదే. అయితే గత 5-6 ఏళ్లుగా ఆసీస్‌ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న జట్టులో స్లెడ్జింగ్‌ చేసే ఆటగాళ్లు చాలా తక్కువనే చెప్పాలి. ఐపీఎల్‌ 13వ సీజన్‌ ముగిసిన తర్వాత భారత్ సుధీర్ఘ పర్యటనలో భాగంగా ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.

మరోసారి స్లెడ్జింగ్‌ ప్రస్థావన

మరోసారి స్లెడ్జింగ్‌ ప్రస్థావన

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. నవంబర్‌ 27 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. డిసెంబరు 17 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సందర్భంగా ఆసీస్‌ మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా.. స్లెడ్జింగ్‌ అంశాన్ని మరోసారి ప్రస్థావనకు తెచ్చాడు. ఈఎస్‌పీఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లతో మాటల యుద్ధానికి దిగడమంటే ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేలా ప్రోత్సహించడమే అవుతుందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వద్ద స్లెడ్జింగ్ లాంటి పప్పులుడకవని తేల్చి చెప్పాడు.

ఆసీస్ ఆటగాళ్లకు ఇదే నా విజ్ఞప్తి

ఆసీస్ ఆటగాళ్లకు ఇదే నా విజ్ఞప్తి

'ఈసారి కోహ్లీసేనపై స్లెడ్జింగ్‌ కాస్త కష్టమే. భారత ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌ పనిచేయకపోవచ్చు. ఎందుకంటే టీమిండియా కొన్నేళ్లుగా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అలాంటి ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌కు దిగితే.. ఆ జట్టు మరిన్ని పరుగులు చేసేలా ప్రోత్సహించడమే అవుతుంది. అందుకే ఆసీస్‌ ఆటగాళ్లకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. టీమిండియాను స్లెడ్జింగ్‌ చేయకుండా వదిలేయండి, వారి ఆటను ఆడనివ్వండి. దయచేసి ఎవరు స్లెడ్జింగ్‌కు పాల్పడొద్దు' అని స్టీవ్ వా సూచించాడు.

కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడు

కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడు

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో నిషేధం కారణంగా గత సిరీస్‌లో ఆసీస్ జట్టుకు స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. 2016-17 ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించినప్పుడు స్మిత్ అత్యద్భుత ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి ఈసారి అతడికంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విరాట్ కోహ్లీ లక్ష్యంగా పెట్టుకుంటాడని వా పేర్కొన్నాడు. 'కోహ్లీ వరల్డ్ క్లాస్ ఆటగాడు. విరాట్ ఆసీస్‌ సిరీస్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదివరకు పర్యటనలో స్మిత్‌-కోహ్లీలు ఒకరినొకరు పోటీపడగా.. అందులో స్మిత్‌ పైచేయి సాధించాడు. ఆ సిరీస్‌లో స్మిత్‌ మూడు సెంచరీలు చేయగా.. విరాట్ రాణించలేకపోయాడు. నెంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న కోహ్లీ ఆ పేరును నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు' అని స్టీవ్ వా పేర్కొన్నాడు.

డిసెంబరు 17న తొలి టెస్ట్

డిసెంబరు 17న తొలి టెస్ట్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు డిసెంబరు 17 నుంచి 21 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు అడిలైడ్ ఓవల్ మైదానం వేదిక కానుంది. ఆ తర్వాత 26 నుంచి రెండో టెస్టు మెల్‌బోర్న్‌లో, మూడో టెస్టు జనవరి 7 నుంచి సిడ్నీ గ్రౌండ్స్‌లో, చివరి టెస్టు జనవరి 15 నుంచి గబ్బాలో ప్రారంభం కానుంది.

SRH vs RCB: సరైన సమయంలో పంజా విసిరింది.. ఇప్పుడు సన్‌రైజర్స్ చాలా డేంజర్: శ్రీకాంత్

Story first published: Friday, November 6, 2020, 18:57 [IST]
Other articles published on Nov 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X