Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: సరైన సమయంలో పంజా విసిరింది.. ఇప్పుడు సన్‌రైజర్స్ చాలా డేంజర్: శ్రీకాంత్

IPL 2020: Kris Srikkanth says SunRisers Hyderabad look like most dangerous at the moment

అబుదాబి: ఐపీఎల్‌ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. కీలక పోరులో ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మ్యాచ్ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ప్లేఆఫ్‌లో సన్‌రైజర్స్ చాలా ప్రమాదకర జట్టుగా కనిపిస్తోందన్నారు.

మూడు వరుస విజయాలు

మూడు వరుస విజయాలు

టోర్నీ ఆరంభంలో తడబడినా.. ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తుది జట్టు సమతూకంగా ఉంది. కొన్ని పరాజయాలతో ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితి సన్‌రైజర్స్‌ జట్టుది. ఆ సమయంలో సన్‌రైజర్స్‌ పుంజుకోవడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో ఉన్న జట్లు ఓడిపోవడంతో వార్నర్ సేన రేసులోకి వచ్చింది. వరుసగా మూడు విజయాలు అందుకుని ప్లేఆఫ్‌లోకి దూసుకొచ్చింది. ఇక అమితుమీ తేల్చుకోనుంది.

సన్‌రైజర్స్ చాలా డేంజర్

సన్‌రైజర్స్ చాలా డేంజర్

తాజాగా క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020‌ని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. మధ్యలో గాయాలు ఆ జట్టుని మరింత దెబ్బతీశాయి. కానీ సరైన సమయంలో పుంజుకుంది. హైదరాబాద్ దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. వరుసగా మూడు విజయాలతో ప్లేఆఫ్‌‌లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ప్లేఆఫ్‌లోని జట్లని చూస్తుంటే.. అన్నింటికంటే హైదరాబాద్ చాలా ప్రమాదకర జట్టుగా కనిపిస్తోంది. జట్టులో భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని భర్తీ చేసే సమర్థమైన భారత బౌలర్ ఎవరూ దొరకలేదు. అయిన్పటికీ ఆ జట్టు ప్లేఆఫ్‌కి చేరింది' అని పేర్కొన్నాడు.

గాయాల ప్రభావం హైదరాబాద్‌పై పడలేదు

గాయాల ప్రభావం హైదరాబాద్‌పై పడలేదు

ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంలోనే ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరమవగా.. ఆ స్థానంలో వెస్టిండీస్‌ టెస్టు కెప్టెన్‌ జేసన్‌ హోల్డర్ జట్టులోకి వచ్చాడు. తర్వాత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ గాయాలతో వరుసగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. అయితే ఆ ప్రభావం మాత్రం ప్లేఆఫ్ ముంగిట హైదరాబాద్‌పై పడలేదు. హోల్డర్‌ రాకతో హైదరాబాద్‌ బలం పెరిగింది. రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్ అద్భుతంగా రాణిస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు

డేవిడ్ వార్నర్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ/ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమాద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షాబాద్ నదీమ్, సందీప్ శర్మ, టీ నటరాజన్.

సెల్ఫ్ ఐసోలేషన్‌లో గౌతమ్ గంభీర్!!

Story first published: Friday, November 6, 2020, 18:20 [IST]
Other articles published on Nov 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+