న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sunrisers Hyderabad: భువనేశ్వర్ స్థానంలో తెలుగు బౌలర్‌కు ఛాన్స్.. ఎవరో తెలుసా?

IPL 2020: SRH replaces Prithvi Raj Yarra in the place Bhuvaneswar kumar

దుబాయ్: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌‌)‌ జట్టుకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఎస్‌ఆర్‌హెచ్‌‌ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. భువీ గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశించింది. అలాగే భువీ స్థానంలో తెలుగు బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు కూడా పేర్కొంది.

భువీ స్థానంలో పృథ్వీ రాజ్:

భువీ స్థానంలో పృథ్వీ రాజ్:

భువనేశ్వర్ కుమార్ స్థానాన్ని ఆంధ్రాకు చెందిన పృథ్వీ రాజ్ యర్రాతో భర్తీ చేస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌‌ యాజమాన్యం తాజాగా ప్రకటించింది. 'గాయం కారణంగా భువనేశ్వర్ కుమార్ డ్రీమ్11 ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని అందరం కోరుకుంటున్నాం. ఈ సీజన్ కోసం భువనేశ్వర్ స్థానంలో పృథ్వీ రాజ్ యర్రాను జట్టులోకి తీసుకుంటున్నాం' అని ఎస్‌ఆర్‌హెచ్‌‌ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సన్‌రైజర్స్ నెట్స్ బౌలరే పృథ్వీ.

వార్నర్ వికెట్ తీశాడు:

వార్నర్ వికెట్ తీశాడు:

పృథ్వీ రాజ్ యర్రా ఆంధ్రాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్. ఇతడు ఐపీఎల్‌లో ఇప్పటికే ఆడాడు. 2019 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పృథ్వీ రెండు మ్యాచ్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీ.. కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ కూడా తీశాడు. ఉప్పల్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు తీసిన ఒకే ఒక్క వికెట్ అదే కావడం విశేషం. 2019 సీజన్ తర్వాత కోల్‌కతా పృథ్వీ రాజ్ యర్రాను రిలీజ్ చేసింది. 22 ఏళ్ల పృథ్వీ 11 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 9 ఏ లిస్ట్, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఎడ‌మ చేతి బౌల‌ర్ అయిన పృధ్వీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఫ‌స్ట్ క్లాస్‌లో 39 వికెట్లు పడగొట్టాడు.

నెట్ బౌలర్‌గా సేవలు:

ఐపీఎల్ 2020 కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పృథ్వీ రాజ్ యర్రాను నెట్ బౌలర్‌గా ఉపయోగించుకుంటోంది. భువనేశ్వర్ కుమార్ అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలగడంతో పృథ్వీకి అవకాశం వచ్చింది. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ స్థాయి బౌలర్‌ను ఎంపిక చేసుకున్నా.. అతడు యూఏఈ వెళ్లాక ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. ఇప్పటికే సరైన పేసర్ లేక సతమతమవుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌‌.. అందుబాటులో ఉన్న పృథ్వీని భువీకి ప్రత్యామ్నాయంగా ప్రకటించింది. ఎస్‌ఆర్‌హెచ్‌‌ ఆడిన ఐదు మ్యాచులలో రెండు విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.

స‌న్‌రైజ‌ర్స్‌ను వీడని గాయాలు:

స‌న్‌రైజ‌ర్స్‌ను వీడని గాయాలు:

స‌న్‌రైజ‌ర్స్ జట్టుకు గాయాల బెడద వీడటం లేదు. తొలి మ్యాచ్‌లోనే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. రెండో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ మనీశ్ పాండే గాయపడ్డాడు. అయితే అతడు త్వరగానే కోలుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మన్‌ కేన్ విలియమ్సన్‌ కూడా గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమయ్యాడు. తాజాగా భువనేశ్వర్ కుమార్ కూడా టోర్నీకి దూరమయ్యాడు. భువీ లేకపోవడం స‌న్‌రైజ‌ర్స్‌కు భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి.

'ఇలాంటి ఆటను నా కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు.. భారత జట్టుకు ఆడే సత్తా అతడికి ఉంది'

Story first published: Tuesday, October 6, 2020, 16:09 [IST]
Other articles published on Oct 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X