'ఇలాంటి ఆటను నా కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు.. భారత జట్టుకు ఆడే సత్తా అతడికి ఉంది'

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసి అందరిని దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ ఆటగాళ్లు విఫలమవుతున్న వేళ.. 20 ఏళ్ల పడిక్కల్ పరుగుల వరద పారిస్తూ బెంగళూరుకు విజయాలు అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచులో మూడు అర్ధ సెంచరీలు బాదాడు. దీంతో మాజీలు అందరూ అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి ఐపీఎల్ అయినా:
ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.. దేవదత్ పడిక్కల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇటువంటి ఆటను తన కెరీర్‌లో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నాడు. బ్రాడ్ హాగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ... 'డిక్కల్‌కు ఇది మొదటి ఐపీఎల్ అయినా.. మూడు ఆఫ్ సెంచరీలు సాధించాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో షెల్డన్ కాట్రెల్ వేసిన షాట్ బంతికి తడబడ్డా.. ఆ తర్వాత మ్యాచుల్లో క్వాలిటీ ఉన్న బౌలర్లు వేసిన షాట్ బంతులను సమర్ధంగా ఎదుర్కున్నాడు. రెండు పుల్ షాట్లు ఆడటం నేను చూశాను. బాగా ఆడాడు' అని తెలిపాడు.

టీమిండియాకు ఆడే సత్తా ఉంది:
'ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా వేసిన షాట్ బంతులను ముందే గుర్తించిన దేవదత్ పడిక్కల్ చక్కగా ఆడాడు. దీనిని బట్టి చూస్తే.. అతడు త్వరగా నేర్చుకునేతత్వం ఉన్న ఆటగాడని తెలుస్తోంది. ఇటువంటి ఆటను నా కెరీర్‌లో ఎన్నడూ చూడలేదు. నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు అర్ధ సెంచరీలు బాదడం గొప్ప విషయం. మొదటి ఐపీఎల్‌లోనే ఇంత బాగా ఆడడం అతనిలోని ప్రతిభ బయటపడింది. భారత జట్టుకు ఆడగల సత్తా అతడిలో ఉంది' బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.

అరుదైన రికార్డు:
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్‌లు ఆడగా.. దేవదత్ పడిక్కల్ 3 హాఫ్ సెంచరీలు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా పడిక్కల్ అరుదైన రికార్డు సాధించాడు. ముంబై ఇండియన్స్‌పై 54 పరుగులు సాధించిన పడిక్కల్.. కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో 1 పరుగు చేసి విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 56 పరుగులు సాధించాడు. రాజస్తాన్‌పై మరో హాఫ్ సెంచరీ ( 63) చేశాడు. తాజాగా ఢిల్లీపై 4 పరుగులు చేశాడు.

ప్రధాన ఆటగాడిగా:
ఐపీఎల్ 2020లో పార్థీవ్ పటేల్ స్థానంలో ఓపెనర్‌గా దిగిన దేవదత్ పడిక్కల్.. అంచనాలను అందుకుంటూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఏకంగా మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. పడిక్కల్ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆర్సీబీకి విజయాలు అందిస్తూ ఇప్పుడు ప్రధాన ఆటగాడిగా మారిపోయాడు. దాంతో పడిక్కల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications