మ్యాచ్‌ జరుగుతుండగా.. సిగరెట్ తాగుతూ దొరికిపోయిన స్టార్ ప్లేయర్ (వీడియో)!!

దుబాయ్: శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్‌ అద్భుతం చేశాడు. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో సిక్సర్లతో తనడైన శైలిలో రెచ్చిపోయి బెంగళూరును విజేతగా నిలిపాడు. మిస్టర్‌ 360 పేరుకు తగ్గట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లతో ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగినా.. డివిలియర్స్ మెరుపులతో బెంగళూరు 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగులు చేసి గెలిచింది.

అందరిలో టెన్షన్ మొదలు

అందరిలో టెన్షన్ మొదలు

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి చివరి 18 బంతుల్లో 45 పరుగులు అవసరం అయ్యాయి. ఆ సమయంలో ఏబీ డివిలియర్స్, గుర్‌కీరత్‌ సింగ్ క్రీజులో ఉన్నారు. ‌ఏబీ ఉన్నా.. అప్పటికి తన మార్క్ షాట్లు ఆడకపోవడంతో బెంగళూరు ఓటమి ఖాయం అనుకుంది. 18వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగి బాగా బౌలింగ్ చేసి 10 రన్స్ మాత్రమే ఇచ్చాడు. డివిలియర్స్ ఆ ఓవర్లో ఒకే ఫోర్ బాదాడు. ఇక బెంగళూరు విజయ సమీకరణం 12 బంతుల్లో 35 పరుగులుగా మారింది. దీంతో అందరిలో టెన్షన్ మొదలైంది.

6 బంతుల్లో 10 పరుగులు

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ వరుసగా మూడు సిక్సర్లు బాదగా.. గుర్‌కీరత్‌ సింగ్ ఓ ఫోర్ కొట్టాడు. మొత్తం ఆ ఓవర్‌లో 25 పరుగులు వచ్చాయి. ఇక బెంగళూరు విజయ సమీకరణం 6 బంతుల్లో 10 పరుగులుగా మారింది. అయితే చివరి ఓవర్‌ని స్టార్ బౌలర్ జోప్రా ఆర్చర్ వేసేందుకు రావడంతో బెంగళూరు శిబిరంలో కంగారు మొదలైంది. అదికాక స్ట్రైకింగ్‌లో గుర్‌కీరత్‌ ఉండడం మరింత టెన్షన్‌కు గురయ్యారు బెంగళూరు ఆటగాళ్లు, యాజమాన్యం, అభిమానులు. ఎందుకంటే.. అప్పటికి 15 బంతులు ఎదుర్కొన్న గుర్‌కీరత్ చేసిన పరుగులు 16 మాత్రమే. ఇందులో చాలా బంతులు డాట్‌కాగా ఉన్నాయి.

ఫించ్ టెన్షన్‌ తట్టులేకపోయాడో ఏమో?

ఫించ్ టెన్షన్‌ తట్టులేకపోయాడో ఏమో?

చివరి ఓవర్ ముందు డ్రెస్సింగ్ రూం వెలుపల ఉన్న బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డగౌట్‌లో కూర్చున్న ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా టెన్షన్‌తో కనిపించారు. ఇక ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్ అయితే టెన్షన్‌ తట్టులేకపోయాడో ఏమో గాని.. ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కాడు. రెండు మూడు పఫ్ లను అతడు లాగించేయడం కనిపించింది. అయితే తొలి బంతికి డబుల్ తీసిన గుర్‌కీరత్.. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి డబుల్ తీసిన ఏబీ.. నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచేసి బెంగళూరు గెలిపించి ఆ జట్టు ఆటగాళ్ల టెన్షన్‌కు తెరదించాడు.

మండిపడుతున్న ఫాన్స్

డ్రెస్సింగ్ రూము డోర్ వద్ద నిల్చొని అరోన్ ఫించ్ ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగుతూ కనిపించడం ఇప్పడు చర్చనీయాంశం అయింది. ఫించ్ సిగరెట్ తాగే సమయంలో డ్రెసింగ్ రూం వెలుపల కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉండటం గమనార్హం. దాంతో డ్రెస్సింగ్ రూంలో సిగరెట్ తాగడానికి మేనేజ్‌మెంట్ ఎలా అనుమతించింది? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ అక్కడే ఉండి ఏం చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.

SRH vs KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. రెండు మార్పులతో బరిలోకి!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 15:51 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X