Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. రెండు మార్పులతో బరిలోకి!!

IPL 2020, SRH vs KKR: Sunrisers Hyderabad have won the toss and have opted to field

అబుదాబీ: వరుస పరాజయాలతో డీలాపడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్.. నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వార్నర్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బాసిత్‌ థంపి జట్టులోకి వచ్చాడు. ఖలీల్ అహ్మద్‌పై చుక్కెదురైంది. మరోవైపు కోల్‌కతా కెప్టెన్ కూడా రెండు మార్పులు చేశాడు. లాకీ ఫెర్గూసన్‌, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఆడుతున్నారు. గ్రీన్, ప్రసీద్‌పై వేటు పడింది.

రెండు జట్లు ఇప్పటి వరకూ 18 మ్యాచుల్లో తలపడ్డాయి. వాటిలో 11 విజయాలతో కోల్‌కతా పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ కోల్‌కతా విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్‌ జరుగనున్న అబుదాబి మైదానంలో హైదరాబాద్‌ గతంలో మూడు మ్యాచులాడి ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. రెండింట్లో ఓటమిపాలైంది. మరోవైపు కోల్‌కతా ఈ వేదికపై ఎనిమిది మ్యాచ్‌లాడింది. అందులో నాలుగు విజయాలు, నాలుగు ఓటములు నమోదు చేసింది.

అబుదాబి మైదానంలో సీజన్‌ ప్రారంభంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువ ఉండేవి. తర్వాత పరిస్థితి తారుమారైంది. ఛేదన జట్లు గెలవడం ప్రారంభించాయి. పిచ్‌ పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియడం లేదు. దీంతో టాస్ కానుంది. ఇక గత మ్యాచుల్లో ఓటమి చవిచూసిన రెండు జట్లు ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు:
హైదరాబాద్: డేవిడ్‌ వార్నర్ ‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, కేన్‌ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, విజయ్‌ శంకర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్ ‌ఖాన్‌, సందీప్‌ శర్మ, టీ నటరాజన్‌, బాసిత్‌ థంపి.

కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, ఇయాన్‌ మోర్గాన్‌ (కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, పాట్‌ కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

Story first published: Sunday, October 18, 2020, 15:18 [IST]
Other articles published on Oct 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+