న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దీపక్ అన్నా.. మేం గెలిస్తే నీకుంటది: రాహుల్ చాహర్

IPL 2020: Rahul Chahar says will tease his brother Deepak Chahar after MI win against CSK

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో రసవత్తరపోరుకు రంగం సిద్దమైంది.మరికొద్ది గంటల్లోనే వరుస విజయాలతో దూకుడు మీదున్న ముంబై ఇండియన్స్‌తో చతికిలపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్ ఆరంభంలో ముంబైపై 5 వికెట్లతో విజయం సాధించిన ధోనీసేన.. ఆ తర్వాత గతితప్పి ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి కనీసం పరువైన దక్కించుకోవాలని అనుకుంటుండగా.. తొలి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రాహుల్ చాహర్.. తన అన్న చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ సేర్ దీపక్ చాహర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన అతను.. అదే జరిగితే తన అన్న దీపక్‌ను ఓ ఆట ఆడుకుంటానన్నాడు. దీనిలో భాగంగా రాహుల్‌ చాహర్‌ మట్లాడిన ఓవీడియోను ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక ట్విటర్‌‌లో అభిమానులతో పంచుకుంది.

'చెన్నైపై గెలుస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ అదే జరిగితే మాత్రం మా అన్న దీపక్‌ చాహర్‌ను ఓ ఆట ఆడుకుంటా. టీజ్ చేస్తా. నాకు 2018 బాగా గుర్తుంది. నన్ను మా బ్రదర్‌ దీపక్‌ చాహర్‌ చాలా టీజ్‌ చేశాడు. అతని జట్టు గెలిచిన తర్వాత నన్ను ఏడిపించాడు. ఆ తర్వాత నాకు అవకాశం వచ్చింది. 2019లో మేము సీఎస్‌కేపై గెలిచిన తరువాత దీపక్‌ను టీజ్‌ చేశా. మళ్లీ ఇప్పుడు మరో అవకాశం నాకు వస్తుందని ఆశిస్తున్నా. బ్రదర్‌ కాస్కో.. నేను టీజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నా' అంటూ రాహుల్‌ చాహర్‌ పేర్కొన్నాడు.

కాగా, తామిద్దరం ఎప్పుడు కలిసిన ఒకరి ఆట గురించి మరొకరం మాట్లాడుకోమని రాహుల్‌ చెప్పాడు. కానీ తాము జట్ల కోసం వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నాడు. మ్యాచ్‌ ఆడేటప్పుడు అన్నను కూడా ప్రత్యర్థి ఆటగాడు మాదిరిగానే చూస్తానని, అందులో ఎలాంటి మొహమాటం ఉండదన్నాడు.

అబ్బే.. ముంబైని ఢీకొట్టడం సీనియర్ సిటజన్స్ క్లబ్‌కు కష్టమే: సెహ్వాగ్అబ్బే.. ముంబైని ఢీకొట్టడం సీనియర్ సిటజన్స్ క్లబ్‌కు కష్టమే: సెహ్వాగ్

Story first published: Friday, October 23, 2020, 18:00 [IST]
Other articles published on Oct 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X