న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ముంబైని కలవరపెడుతున్న లీప్ ఇయర్ సెంటిమెంట్.. సన్‌రైజర్స్‌కు మాత్రం ప్లస్ పాయింట్!

IPL 2020, Qualifier 1, DC vs MI: ‘Leap Year’ sentiment Delhi Capitals win over Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌ తుది దశకు చేరింది. మరికొద్ది గంటల్లో ప్లే ఆఫ్స్ సమరానికి తెరలేవనుంది. టేబుల్ టాపర్ ముంబై ఇండియన్స్, సెకెండ్ ప్లేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ దుబాయ్ వేదికగా జరిగే క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌ను ఓ సెంటిమెంట్ కలవరపెడుతుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రం ఆశలు రెకెత్తిస్తోంది.

టేబుల్ టాపర్‌కు లీప్ ఇయర్ గండం..

టేబుల్ టాపర్‌కు లీప్ ఇయర్ గండం..

ఆ సెంటిమెంట్ ఏంటంటే లీప్ సంవత్సరాల్లో టేబుల్ టాపర్‌గా ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు వరుసగా ఓడి ఇంటి దారి పట్టాయి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా రెండు సార్లు జరిగింది. ఐపీఎల్‌లో 2011లో ప్లేఆఫ్ విధానం అమల్లోకి రాగా.. అప్పటి నుంచి ప్రతి లీప్ ఇయర్‌లో.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ప్లేఆఫ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడి ఫైనల్ చేరకుండానే నిష్క్రమిస్తోంది. 2012, 2016 సీజన్లలో ఇలాగే జరిగింది.

అప్పుడు ఢిల్లీ..

అప్పుడు ఢిల్లీ..

లీప్ సంవత్సరం అయిన 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) లీగ్ దశలో 22 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తొలి ప్లేఆఫ్ మ్యాచ్‌లో కో‌ల్‌కతా చేతిలో ఓడిన ఢిల్లీ.. తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయం పాలైంది. కోల్‌కతా, చెన్నై మధ్య ఫైనల్ జరగ్గా.. కోల్‌కతా టైటిల్ గెలిచింది.లీప్ సవంత్సరం అయిన 2016లోనూ ఇదే కథ రిపీట్ అయింది. గుజరాత్ లయన్స్ 18 పాయింట్లతో లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో.. తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. బెంగళూరుతో జరిగిన ఫైనల్లో గెలిచిన సన్‌రైజర్స్ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. మరి ఈ ఏడాది ఏం జరుగుతుందో చూడాలి.

సన్‌రైజర్స్‌కు ప్లస్ పాయింట్..

సన్‌రైజర్స్‌కు ప్లస్ పాయింట్..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రం ఈ లీప్ ఇయర్ సెంటిమెంట్ కలిసొస్తుంది. హైదరాబాద్ గెలిచిన టైటిల్ లీప్ ఇయర్ 2016 కావడం విశేషం. ఇప్పటికే ఆ సీజన్ పరిస్థితులు పునరావృతం అవుతుండగా.. టైటిల్ తమదేనని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సీజన్‌లో ధావల్ కులకర్ణి ఉన్న గుజరాత్ లయన్స్ టాప్‌లో నిలిచింది. ఇప్పుడు అతను ముంబైలో ఉండగా.. ఆ జట్టు టాప్‌లో ఉంది. అంతేకాకుండా అప్పుడు, ఇప్పుడు ఆర్‌సీబీ నంబర్ 4లో ఉంది. ఇలా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండటంతో టైటిల్ గెలవడంపై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్ చేరేదేవరో..?

ఫైనల్ చేరేదేవరో..?

లీగ్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌‌లో ఫేవరేట్‌గా బరిలో దిగుతుంది. పైగా ఈ సీజన్‌లో ఇరు జట్లూ రెండుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. అంతే కాకుండా గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ కేవలం ఒకే విజయం సాధించింది. మరోవైపు ముంబై కూడా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతులో చిత్తయింది. కాకపోతే ఈ మ్యాచ్‌కు జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యలకు విశ్రాంతి ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఢిల్లీతో పోలిస్తే ముంబై బలంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో ఆడుతుంది.

Happy Birthday Virat Kohli: బాల్ బాయ్ నుంచి టీమిండియా సారథిగా.. శతకవీరా సరిలేరు నీకెవ్వరూ!

Story first published: Thursday, November 5, 2020, 14:45 [IST]
Other articles published on Nov 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X