న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 Playoffs: ఢిల్లీపై ఘన విజయం.. చిగురించిన ఆశలు.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరొచ్చిలా!!

IPL 2020 Playoff Scenarios: Sunrisers Hyderabad has two-ways to fight for fourth spot

హైదరాబాద్: దుబాయ్ గడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొట్టింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తాచాటింది. మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై వీరవిహారం చేసింది. మొదట పరుగుల వరద పారించి.. ఆపై బౌలింగ్‌లోనూ అదరగొట్టి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ బౌలింగ్‌ను ఉతికిపారేస్తే.. స్పిన్ మాయగాడు రషీద్‌ ఖాన్‌ ఢిల్లీని చుట్టేశాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీని 88 పరుగుల తేడాతో చిత్తుచేసింది. సన్‌రైజర్స్‌కు ఇది అయిదో విజయం కాగా ఢిల్లీకి వరుసగా మూడో పరాజయం.

ఇప్పటికీ అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ లేదు

ఇప్పటికీ అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ లేదు

ఐపీఎల్ 2020లో 47 లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా కూడా ఏ జట్టు అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోలేదు. ఈ రోజు నుంచి ఒక్కో జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకోనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న జట్లు వరుసగా పరాజయాల పట్టడం సన్‌రైజర్స్‌ జట్టుకు భారీగానే కలిసొచ్చింది. ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చేలా చేశాయి. ఐపీఎల్ 2020లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 12 మ్యాచ్‌లు ఆడి ఐదు విజయాలు అందుకుంది. ఢిల్లీపై ఘన విజయం సాధించడంతో సన్‌రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది. నిన్నటివరకు మైనస్‌లో ఉన్న రన్ రేట్.. ఒక్కసారిగా ప్లస్‌లోకి వచ్చింది. దీంతో ప్లేఆఫ్స్ ఆశలు చిగురించాయి. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ చేరడానికి రెండు అవకాశాలు ముందున్నాయి.

IPL 2020,SRH vs DC Match Preview, Teams Details & Pitch Report || Oneindia Telugu
రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే:

రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే:

అబుదాబి వేదికగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 16 పాయింట్లతో అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకుంటుంది. ఇక మిగతా ఆరు జట్లు మరో రెండేసి మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధిస్తే.. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్థానంకు ఎసరు వస్తుంది. ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకునే దశలో ఢిల్లీ వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓడిపోయింది. ఢిల్లీ ఇంకో రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో ఏ ఒక్కదాంట్లో గెలిచినా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. లేదంటే దాని స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇలా ఉన్నాయి.

 మొదటి అవకాశం:

మొదటి అవకాశం:

పట్టికలో టాప్-3లో ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరతాయనుకుంటే.. నాలుగో స్థానం కోసం ప్రస్తుతం పంజాబ్, కోల్‌కతా, సన్‌రైజర్స్, రాజస్థాన్ జట్లు పోటీ పడతాయి. ప్రస్తుతం పంజాబ్, కోల్‌కతా‌ 12 పాయింట్లతో రేసులో ముందు ఉన్నాయి. అయితే ఈ 2 జట్లూ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. మరోవైపు సన్‌రైజర్స్ ఆడే మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఇక రాజస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా.. మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. చెన్నై రేసులో లేదు. అయితే రాజస్థాన్, చెన్నై తర్వాతి రెండు మ్యాచ్‌లు పంజాబ్, కోల్‌కతాతో ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, చెన్నై తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిస్తే సన్‌రైజర్స్‌కు లాభిస్తుంది.

 రెండో అవకాశం:

రెండో అవకాశం:

ఒక వేళ పంజాబ్, కోల్‌కతా జట్లలో ఏదో ఒకటి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే.. ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అప్పటికీ సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. టాప్-3లో ఉన్న మూడు జట్ల ఖాతాల్లో 14 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. బెంగళూరు లేదా ఢిల్లీ జట్లలో ఏదో ఒక జట్టు తర్వాత ఆడబోయే అన్ని మ్యాచ్‌ల్లో ఓడితే.. మెరుగైన నెట్ రన్ రేట్ సాయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్ చేరొచ్చు. బెంగళూరు తర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై, హైదరాబాద్, ఢిల్లీతో తలపడనుంది. ముంబై, బెంగళూరుతో ఢిల్లీ ఆడనుంది. ఢిల్లీ రెండు మ్యాచ్‌ల్లో ఓడి, రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ గెలిస్తే .. ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్‌కు చేరొచ్చు. రెండు అవకాశాల్లో సన్‌రైజర్స్ మాత్రం రెండు విజయాలు సాదించాల్సిందే. ఏం జరుగుతుందో చూడాలి. నెల 31వ తేదీన బెంగళూరు, వచ్చేనెల 3న ముంబై‌తో సన్‌రైజర్స్ తలపడుతుంది.

SRH vs DC: వాటే స్పెల్‌ రషీద్‌!! ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్ గణాంకాలు‌.. అత్యుత్తమ ఎకానమీ!!

Story first published: Wednesday, October 28, 2020, 10:03 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X