For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: వాటే స్పెల్‌ రషీద్‌!! ఐపీఎల్‌లో బెస్ట్‌ బౌలింగ్ గణాంకాలు‌.. అత్యుత్తమ ఎకానమీ!!

IPL 2020, SRH vs DC: Rashid Khan bowled 6th most 4-over economical spell in IPL history

దుబాయ్‌: యూఏఈలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొడగొట్టింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదరగొట్టింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గత మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓడిపోయిన హైదరాబాద్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం వీరవిహారం చేసింది. మొదట పరుగుల వరద పారించి.. ఆపై బౌలింగ్‌లోనూ అదరగొట్టి స్ఫూర్తిదాయక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ బౌలింగ్‌ను ఉతికిపారేస్తే.. స్పిన్ మాయగాడు రషీద్‌ ఖాన్‌ ఆ జట్టును చుట్టేశాడు. మొత్తానికి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్‌.. ఢిల్లీని 88 పరుగుల తేడాతో చిత్తుచేసింది.

బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు

బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు

ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లును నేలకూల్చాడు. 17 డాట్ బాల్స్ వేశాడు. షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌.. అజింక్య రహానేను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌‌ను క్యాచ్‌గా ఔట్ చేసి మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఈ ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలను (3/7) నమోదు చేశాడు. అంతేకాకుండా అత్యుత్తమ ఎకానమీని (1.91) కూడా రషీద్‌ లిఖించాడు.

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకానమీ

ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకానమీ

ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకానమీని (1.91) నమోదు చేసిన రషీద్‌ ఖాన్.. టోర్నీ చరిత్రలో ఆరో ‌స్థానంలో ఉన్నాడు. ఆశిష్ నెహ్రా (1/6, 2009), ఫిడేల్ ఎడ్వర్డ్స్ (0/6, 2009), యుజ్వేంద్ర చహల్ (1/6, 2019), రాహుల్ శర్మ (2/7I, 2011), లాకీ ఫెర్గూసన్ (2/7, 2017)లు రషీద్‌ ఖాన్ కంటే ముందున్నారు. ఈ ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదే విజయం సాధించగా.. అక్కడ కూడా రషీద్‌ కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీతో తొలి అంచె మ్యాచ్‌లో రషీద్‌ నాలుగు ఓవర్లలో 13 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.

ఓవర్‌కు ఎకానమీ 5.00

ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన రషీద్‌ ఖాన్‌ మొత్తం 17 వికెట్లను సాధించగా.. ఎకానమీ 5.00గా ఉంది. 48 ఓవర్ల బౌలింగ్‌ వేసిన రషీద్‌.. 240 పరుగులు ఇచ్చాడు. ఓవర్‌కు ఎకానమీ 5.00గా నమోదైంది. ఇదే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అత్యుత్తమ ఎకానమీ. ఈ క్రమంలోనే ఎకానమీలో ఆర్సీబీ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను రషీద్ వెనక్కినెట్టాడు. సుందర్‌ ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లాడి 5.72 ఎకానమీతో ఉన్నాడు. సుందర్‌ 37 ఓవర్లు వేసి 212 పరుగులిచ్చాడు.

సాహాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్'‌

సాహాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్'‌

మంగళవారం మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోరు చేసింది. వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (87; 45 బంతుల్లో 12×4, 2×6), డేవిడ్ వార్నర్‌ (66; 34 బంతుల్లో 8×4, 2×4) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడారు. లక్ష్య ఛేదనలో రషీద్ ‌ఖాన్‌ (3/7) దెబ్బకు ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. రిషబ్‌ పంత్‌ (36; 35 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. సాహాకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

SRH vs DC: బర్త్ డే రోజు బాదేసిన వార్నర్!! తల్లి సలహానే పాటించి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా..!!

Story first published: Wednesday, October 28, 2020, 8:49 [IST]
Other articles published on Oct 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+