న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI Preview: ఇప్పటివరకు హై స్కోరింగ్ మ్యాచ్ లేదు.. ఈరోజు సాధ్యమయ్యేనా?

IPL 2020, MI vs SRH Preview: No High Scoring Match between these teams in IPL

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ‌శ‌ర్మ నేతృత్వంలోని ముంబై ఇండియ‌న్స్‌తో డేవిడ్ వార్న‌ర్ సార‌థ్యంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ల‌ప‌డ‌నుంది. సీజ‌న్-13లో రెండు జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఐదేసీ మ్యాచ్‌లు ఆడి.. రెండేసి మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాయి. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. ఇక పంజాబ్ జట్టుపై గెలిచిన ముంబై కూడా .. మరో మ్యాచ్ గెలవాలనే కసితో ఉంది.

హై స్కోరింగ్ సాధ్యమయ్యేనా?

హై స్కోరింగ్ సాధ్యమయ్యేనా?

హైద‌రాబాద్, ముంబై జట్ల మధ్య ఇప్పటివరకు హై స్కోరింగ్ మ్యాచ్ లేదు. హైద‌రాబాద్ జట్టుపై అత్యధికంగా ముంబై 184 పరుగులు చేసింది. అదే హైద‌రాబాద్ 178 రన్స్ చేసింది. ఇరు జట్లు తలపడినప్పుడు ఒక్కసారి కూడా 200 మార్క్ స్కోర్ నమోదుకాలేదు. అయితే ఈ రోజు మ్యాచ్ జరిగే షార్జా మైదానం చిన్నదిగా ఉంటుంది. చిన్న స్టేడియంలో ఇరు జట్లలోని హిట్టర్లు సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది కాబట్టి ఈ రోజు హై స్కోరింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

బెయిర్‌స్టో బాకీ ఉన్నాడు

బెయిర్‌స్టో బాకీ ఉన్నాడు

హైదరాబాద్‌ బ్యాటింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్‌ నుంచి ఇప్పటి వరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్‌ లేదు. వాళ్లు రాణిస్తే తర్వాత వచ్చే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బెయిర్‌స్టో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాండే, విలియమ్సన్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చేఅంశం. ఇక ‌కుర్రాళ్లు ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ సత్తా చాటాలని సన్‌రైజర్స్ ఆశిస్తోంది.

భువనేశ్వర్‌ ఆడుతాడా?

భువనేశ్వర్‌ ఆడుతాడా?

బౌలింగ్‌లో హైదరాబాద్‌ బలంగానే కనిపిస్తోంది. అయితే గత మ్యాచ్‌లో గాయంతో అర్ధాంతరంగా మైదానం వీడిన స్టార్ పేసర్ భువనేశ్వర్‌ కుమార్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు. యార్కర్‌ స్పెషలిస్ట్‌ టీ నటరాజన్‌, స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తమ ఫామ్‌ కొనసాగిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఖలీల్‌ అహ్మద్‌ మాత్రం బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ భువీ దూరమయితే ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బాధ్యత రషీద్‌పై పడుతుంది. రోహిత్, పోలార్డ్, హార్దిక్ పాండ్యలను అతడు నియంత్రించాల్సి ఉంటుంది.

పటిష్టంగా ముంబై

పటిష్టంగా ముంబై

ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పరుగుల వరద పారిస్తున్నాడు. డికాక్‌ ఇప్పటికీ తన మార్క్ బ్యాటింగ్‌ కనిపించలేదు. రోహిత్‌ తర్వాత భారం మొత్తం మిడిల్‌ ఆర్డర్‌పైనే పడుతోంది. ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, పాండ్య కీలక సమయంలో బౌండరీలతో జట్టును గట్టెక్కిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, జేమ్స్ ప్యాటిన్సన్‌, జస్ప్రీత్ బుమ్రా మంచి టచ్‌లో ఉన్నారు. స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కలిసిగట్టుగా రాణిస్తే హైదరాబాద్‌పై విజయం సాధ్యమే.

చెరో 7 మ్యాచుల్లో

చెరో 7 మ్యాచుల్లో

హైదరాబాద్‌, ముంబై జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెరో 7 మ్యాచుల్లో విజయాలు సాధించాయి. అయితే.. గత 5 మ్యాచుల్లో ఫలితాలు గమనిస్తే.. హైదరాబాద్‌ కాస్త పైచేయి సాధించింది. మూడు విజయాలతో ముంబైని వెనక్కి నెట్టింది. గతంలో ఇక్కడ మ్యాచులో హైదరాబాద్‌ విజయం సాధించింది.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

ముంబై: రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్‌ బౌల్ట్, జస్ప్రీత్‌ బుమ్రా.

హైదరాబాద్: డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, సమద్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్.

DC vs KKR: దినేశ్ కార్తీక్ మాకొద్దు బాబోయ్.. అతడే మాకు కెప్టెన్‌గా కావాలి: కోల్‌కతా ఫ్యాన్స్

Story first published: Sunday, October 4, 2020, 13:13 [IST]
Other articles published on Oct 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X