
సారథ్యంలో తేలిపోతున్న డీకే
దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి, మరో రెండింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దినేశ్ కార్తీక్ పరుగులు చేయడంలో విఫలం అవుతున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక సారథ్యంలో కూడా తేలిపోతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ రోటేషన్ విషయంలోనూ తడబడుతున్నాడు. గత రాత్రి కమలేష్ నాగర్‌కోటి ఇంకో ఓవర్ వేయాల్సి ఉన్నా.. డెత్ ఓవర్లో లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో బౌలింగ్ చేయించాడు. దీంతో భారీగా పరుగులొచ్చాయి. ఇక తప్పిదాల నుంచి త్వరగా నేర్చుకోలేకపోతున్నాడు.

కార్తీక్ మాకొద్దు బాబోయ్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓడిన తర్వాత కెప్టెన్‌ను మార్చాలంటూ కేకేఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దినేశ్ కార్తీక్‌కు బదులు ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌కు నాయకత్వ పగ్గాలు అప్పించాలని చాలా మంది సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. 'కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ మాకొద్దు బాబోయ్', 'ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ మాకు కెప్టెన్‌గా కావాలి' అని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. 'జాతీయ జట్టులో చోటు దక్కని ఆటగాడికి కోల్‌కతా కెప్టెన్సీ అప్పగించింది' అని మరికొందరు మండిపడుతున్నారు. కెప్టెన్ సరిగా ఆడకపోతే జట్టుపై ప్రభావం పడుతుందని ఫైర్ అవుతున్నారు.

టామ్ బాంటన్‌ను తీసుకోండి
ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో రాణించలేకపోయిన సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపుతుండటం పట్ల కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో నరైన్ ఇబబంది పడుతున్నాడు. బౌలింగ్‌లోనూ ఈ కరేబియన్ ప్లేయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అయినా కూడా దినేష్ కార్తీక్ అతడికే అవకాశాలు ఇస్తున్నాడు. నరైన్ బదులు టామ్ బాంటన్‌ను జట్టులోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఇయాన్ మోర్గాన్‌ను మూడు లేదా నాలుగో స్థానంలో ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.

పాఠాలు నేర్చుకోలేదా?
ఇంతకుముందు కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ తన దూకుడుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అతడి కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్‌లోనే కోల్‌కతా నాలుగో స్థానంకు చేరింది. తర్వాత రెండుసార్లు టైటిల్ సాధించింది. అలాంటి ఛాంపియన్ జట్టు సారథ్య బాధ్యతలు అందుకున్న దినేష్ కార్తీక్ మాత్రం గంభీర్ నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన పరిణితి చూపించడం లేదు. గంభీర్ సారథ్యంలో కోల్‌కతా విజయాల రేటు 56.48గా ఉండగా.. కార్తీక్ జట్టు పగ్గాలు అందుకున్నాక అది 51.52కు పడిపోయింది.


Click it and Unblock the Notifications

RCB vs RR: రాహుల్ తెవాటియాకు విరాట్ కోహ్లీ గిఫ్ట్!!










