MI vs RCB: ముంబై మురిసెనా.. బెంగళూరు గెలిచెనా? అసలు రోహిత్ శర్మ ఆడెనా?

IPL 2020,MI vs RCB Match Preview, Teams Details And Pitch Report || Oneindia Telugu

అబుదాబి: కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ ఫిట్‌‌నెస్‌‌పై ఆందోళన నెలకొనగా.. డిఫెండింగ్‌‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌‌ కీలక సవాల్‌‌కు రెడీ అయింది. బుధవారం జరిగే మ్యాచ్‌‌లో పటిష్ట రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరుతో పోటీ పడనుంది. 11 మ్యాచ్‌‌ల్లో చెరో ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో 1, 2వ స్థానాల్లో ఉన్న ఇరు జట్లూ మరో విజయంతో ప్లే ఆఫ్స్‌‌ బెర్త్​ను అధికారికంగా ఖరారు చేసుకోవాలని భావిస్తున్నాయి. అలాగే, ఇరు జట్లూ తమ గత మ్యాచ్‌‌ల్లో చిత్తుగా ఓడి కాస్త డీలా పడ్డాయి. ముంబై 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ చేతిలో ఓడగా.. బెంగళూరు కూడా అన్నే వికెట్ల తేడాతో చెన్నై చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. దాంతో, ఈ మ్యాచ్‌‌లో గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని రెండు టీమ్స్‌‌ ఆశిస్తున్నాయి.

రోహిత్ శర్మ డౌటే

రోహిత్ శర్మ డౌటే

తొడ కండరాల సమస్యతో బాధపడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌‌కు కూడా దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కాకపోవడం.. సోమవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడంతో రోహిత్ శర్మ ఆడటం ఆసక్తినెలకొంది. మరీ రోహిత్ బరిలోకి దిగుతాడా? లేక బెంచ్‌కే పరిమితమవుతాడో చూడాలి. అలాగే తొలి అంచె మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు సూపర్ ఓవర్‌కు దారితీసింది. నవ్‌దీప్ సైనీ సూపర్ బౌలింగ్‌తో బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ముంబై భావిస్తోంది.

ముంబైకి తిరుగులేదు..

ముంబైకి తిరుగులేదు..

ఒకవేళ రోహిత్ దూరమైతే సౌరభ్‌‌ తివారీ కొనసాగనున్నాడు. అతనితో పాటు సూర్యకుమార్‌‌ యాదవ్, ఇషాన్‌‌ కిషన్‌‌ మెరుపులు మెరిపిస్తుండడం జట్టుకు ప్లస్‌‌ పాయింట్. రాజస్తాన్‌‌పై ఫెయిలైనప్పటికీ క్వింటన్‌‌ డికాక్‌‌ ఫామ్‌‌లోనే ఉన్నాడు. హార్దిక్‌‌ పాండ్యా కూడా సిక్సర్లతో చెలరేగిపోతున్నాడు.

తాత్కలిక‌ కెప్టెన్‌‌ కీరన్‌‌ పొలార్డ్​, కృనాల్‌ పాండ్యా‌ కూడా బ్యాట్‌‌ ఝుళిపిస్తున్నారు కాబట్టి బ్యాటింగ్‌‌ పరంగా ముంబైకి బెంగలేదు. బౌలర్లు కూడా ఈ సీజన్‌‌లో అద్భుత పెర్ఫామెన్స్‌‌ చేస్తున్నారు. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లు రప్ఫాడిస్తున్నారు. అయితే, రాజస్తాన్‌‌ చేతిలో ఎదురైన చేదు జ్ఞాపకం నుంచి వాళ్లు వెంటనే బయట పడాల్సి ఉంది.

నవ్‌దీప్ సైనీ డౌట్...

నవ్‌దీప్ సైనీ డౌట్...

మరోవైపు బెంగళూరు కూడా అన్ని విభాగాల్లో బలంగానే ఉంది. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, దేవదత్‌‌ పడిక్కల్‌‌, ఏబీ డివిలియర్స్‌‌ సత్తా చాటుతున్నారు. ఆరోన్‌‌ ఫించ్‌‌ కాస్త నిలకడగా ఆడితే ఆ టీమ్‌‌కు తిరుగుండదు. అయితే, పేసర్‌‌ నవదీప్‌‌ సైనీకి గాయం కావడం ఒక్కటే జట్టును కలవర పెడుతోంది. బౌలింగ్ చేసే చేతికి గాయం కావడంతో అతని గురించి క్లారిటీ లేదు. ఒకవేళ సైనీ ఆడకపోతే మాత్రం ఆర్‌‌సీబీ బౌలింగ్‌‌ కచ్చితంగా వీక్‌‌ అవుతుంది. ఏదేమైనా రెండు పటిష్ట జట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించే అవకాశం ఉంది.

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

అబుదాబి పిచ్ స్పిన్‌కు అనుకూలం. ఈ మైదానంలో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు జరగ్గా 8 మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్ గెలిచింది. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఈ మైదానంలో ముంబై ఏడు మ్యాచ్‌లు ఆడగా.. 5 గెలిచింది. రెండు మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ రెండింటిలో గెలిచింది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 26 సార్లు తలపడగా.. 16-10తో ముంబై లీడ్‌లో ఉంది. చివరి 5 మ్యాచ్‌ల్లో ముంబై మూడు సార్లు గెలిచింది.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సౌరభ్‌ తివారి, హార్దిక్‌ పాండ్యా, కీరన్ పొలార్డ్‌(కెప్టెన్), కృనాల్‌ పాండ్యా, ట్రెంట్‌ బౌల్ట్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, రాహుల్‌ చహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), దేవదూత్ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌, ఏబి డివిలియర్స్‌, మొయిన్‌ అలీ/ఇసురు ఉడానా, గుర్‌క్రీత్ సింగ్, క్రిస్ మొర్రిస్, వాషింగ్టన్‌ సుందర్‌, నవ్‌దీప్‌ సైనీ/ఉమేశ్ యాదవ్, మహమ్మద్‌ సిరాజ్‌, యుజువేంద్ర చాహల్.

నీ భార్యను 14 రోజులు ఇవ్వూ... బెన్‌ స్టోక్స్‌పై వెస్టిండీస్ క్రికెటర్ అసభ్య పదజాలం!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Wednesday, October 28, 2020, 15:10 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X