న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RCB: రాణించిన పడిక్కల్, ఫిలిప్.. ముంబై ముందు పోరాడే లక్ష్యం!

: Bumrah special restricts Bangalore to 164 despite Padikkal 74

అబుదాబి: దేవదత్ పడిక్కల్(45 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 74), జోష్ ఫిలిప్(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) రాణించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా(3/14) మూడు వికెట్లతో రాణించగా.. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, కీరన్ పొలార్డ్ తలో వికెట్ తీశారు.

అదిరే ఆరంభం..

అదిరే ఆరంభం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి మంచి శుభారంభం దక్కింది. ఆరోన్ ఫించ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జోష్ ఫిలిప్(33), దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. ఫస్ట్ రెండు ఓవర్లు ఓపికగా ఆడిన ఈ జోడీ.. అనంతరం ఓవర్‌కు 10 పరుగుల తగ్గకుండా ఆడింది. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 54 రన్స్ చేసింది. అనంతరం రాహుల్ చాహర్ వేసి 8వ ఓవర్‌లో బౌండరీ కొట్టిన ఫిలిప్.. స్టెప్ ఔటై ఆడే ప్రయత్నంలో స్టంప్ ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

బుమ్రా@100..

బుమ్రా@100..

అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ కొంచెం తడబడ్డాడు. మరోవైపు పడిక్కల్ మాత్రం వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. కృనాల్ పాండ్యా వేసిన 11వ ఓవర్‌లో ఎక్స్ ట్రా కవర్ దిశగా బౌండరీ తరలించి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిది నాలుగో హాఫ్ సెంచరీ. అయితే బుమ్రా వేసిన మరసటి ఓవర్‌లోనే కోహ్లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ వికెట్ బుమ్రాకు ఐపీఎల్‌లో 100వ వికెట్ కావడం విశేషం. తర్వాత క్రీజులోకి వచ్చి ఏబీ డివిలియర్స్‌తో పడిక్కల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. పాటిన్సన్ వేసిన 14 ఓవర్‌లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన ఏబీడీ టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. ఇక చాహర్ వేసిన 15 ఓవర్‌లో పడిక్కల్ 6, 4, 4తో చెలరేగడంతో ఈ ఓవర్‌లో 16 రన్స్ వచ్చాయి.

డివిలియర్స్ ఔట్‌తో..

డివిలియర్స్ ఔట్‌తో..

క్రీజులో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని పొలార్డ్ విడదీసాడు. అతను వేసిన ఫుల్ టాస్ బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన డివిలియర్స్.. లైన్ మిస్సవ్వడంతో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 36 పరుగుల స్వల్ప భాగస్వామ్యానికి తెరపడింది. ఈ కీలక వికెట్‌తో ఆర్‌సీబీ జోరు తగ్గింది. బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో బంతి వ్యవధిలోనే శివమ్ దూబే(2), పడిక్కల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. దాంతో ఈ ఓవర్ డబుల్ వికెట్ మెయిడిన్‌గా నిలిచింది.

బౌల్ట్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన క్రిస్ మోరిస్(4).. మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివర్లో గుర్ క్రీత్ సింగ్(14 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(10 నాటౌట్) వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే చివరి 5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 35 పరుగులే చేయడంతో ఆర్‌సీబీ 164 పరుగులకే పరిమితమైంది.

Story first published: Wednesday, October 28, 2020, 21:44 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X