న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs DC: ముందస్తు హెచ్చరిక.. నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ.. మీ గుండెలు జర భద్రం!

 IPL 2020, KXIP vs DC: Who will win Kings XI Punjab vs Delhi Capitals, Predicted Playing XI

దుబాయ్‌‌: క్రికెట్ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో రెండు సూపర్‌‌ ఓవర్లకు దారి తీసిన మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయం సాధించిన కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌ మరో సవాల్‌‌కు రెడీ అయింది. వరుసగా రెండు విక్టరీలతో ప్లే ఆఫ్‌‌ అవకాశాలు సజీవంగా ఉంచుకోవడంతో పాటు కాన్ఫి డెన్స్‌‌ పెంచుకున్న రాహుల్‌‌సేన మంగళవారం జరిగే మ్యాచ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌ ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను ఢీకొట్టనుంది. దాంతో మరో రసవత్తరపోరు తప్పేలా లేదు.

పైగా ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరు సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అంతేకాకుండా పంజాబ్ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒకటి రెండు మినహా అన్నీ ఉత్కంఠతను రేకెత్తించాయి. దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. అందుకే ముందస్తు హెచ్చరికగా..మీ గుండెల్ని భద్రంగా ఉంచుకోమని చెబుతున్నాం.!

పంజాబ్ పక్కా ప్రణాళికతో రావాలి...

పంజాబ్ పక్కా ప్రణాళికతో రావాలి...

ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌‌ నెగ్గాల్సిన పరిస్థితి ఉండడంతో ఢిల్లీపై గెలిస్తే ఆ జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరగనుంది. అది జరగాలంటే పంజాబ్‌‌ మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేయాల్సి ఉంది. ముఖ్యంగా మ్యాచ్‌‌లను ముగించే విషయంలో ఆ జట్టు పక్కాప్లాన్‌‌ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే గత రెండు మ్యాచ్‌‌ల్లోనూ ఆ జట్టు ఈజీగా గెలవాల్సింది. ఆర్‌‌సీబీతో మ్యాచ్‌‌ను ఫైనల్‌‌ బాల్‌‌ వరకూ తీసుకెళ్లిన పంజాబ్‌‌... ఆదివారం ముంబైపై రెండు సూపర్‌‌ ఓవర్లు ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

గేల్‌‌ ఫామ్‌‌లో ఉండడం

గేల్‌‌ ఫామ్‌‌లో ఉండడం

టాపార్డర్‌‌ అద్భుతంగా రాణిస్తున్నా మిడిలార్డర్‌‌ నుంచి సరైన సపోర్ట్‌‌ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది. లోకేశ్‌‌, మయాంక్‌‌ తో పాటు లేటుగా అవకాశం వచ్చినా తనదైన స్టయిల్లో దుమ్మురేపుతున్న గేల్‌‌ ఫామ్‌‌లో ఉండడం కింగ్స్‌‌కు ప్లస్‌‌ పాయింట్‌‌. కానీ, మిడిలార్డర్‌‌లో స్టార్‌‌ ప్లేయర్‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌ పేలవ ఫామ్‌‌ జట్టును దెబ్బతీస్తోంది. అలాగే, షమీ తప్ప డెత్‌‌ ఓవర్లలో సత్తా చాటే బౌలర్‌‌ లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఈ సవాళ్లను అధిగమిస్తేనే పటిష్ట ఢిల్లీకి పంజాబ్‌‌ చెక్‌‌ పెట్టగలదు. మ్యాక్స్‌వెల్ వద్దనుకుంటే జిమ్మీ నీషమ్ జట్టులోకి రావచ్చు.

ఢిల్లీ జోరు..

ఢిల్లీ జోరు..

ఇక 9 మ్యాచ్‌‌ల్లో ఏడు విక్టరీలతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ జోరు మీదుంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో చెన్నైపై విజయంతో ప్లేఆఫ్‌‌కు చేరువైన ఆ జట్టు పంజాబ్‌‌ను ఓడించి బెర్తు కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది. ఓపెనర్‌‌ పృథ్వీ షా ఫామ్‌‌ కోల్పోయినా శిఖర్ ధావన్‌‌ జోరందుకోవడం ప్లస్‌‌ పాయింట్‌‌. బౌలింగ్‌‌లోనూ ఆ టీమ్‌‌కు ఎలాంటి సమస్యల్లేవు. పంజాబ్‌‌పైనే సూపర్‌‌ ఓవర్లో గెలిచి లీగ్‌‌ను స్టార్ట్‌‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌.. ఆ జట్టును మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

ఇదే మైదానం వేదికగా ఇరు జట్లు మధ్య జరిగిన గత మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారితీసింది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌‌కు కూడా ఇదే మైదానం వేదికైంది. ఇక ఈ మైదానంలో ఐదు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ మూడు గెలిచింది. ఇది వారికి అచ్చొచ్చిన మైదానం. ఇక నాలుగు మ్యాచ్‌లు ఢిల్లీ నాలుగు గెలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. స్పిన్‌కు అనుకూలం.

ముఖా ముఖి

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరగ్గా 14-11తో పంజాబ్ ఆధిక్యంలో ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌లో మాత్రం చెరో రెండు సార్లు గెలిచాయి. గత సీజన్‌లో కూడా చెరొక విజయాన్నందుకున్నాయి.

తుది జట్లు

తుది జట్లు

ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అలెక్స్ క్యారీ (కీపర్), మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, తుషార్ దేశ్ పాండే

పంజాబ్: కేఎల్ రాహుల్(కీపర్/కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్‌‌‌‌వెల్, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

నీలానే గంగూలీ అనుకుంటే ఎక్కడ ఉండేవాడివి? ధోనీ స్పార్క్ కామెంట్స్‌పై దుమారం!

Story first published: Tuesday, October 20, 2020, 13:40 [IST]
Other articles published on Oct 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X