న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: కోహ్లీసేనపై కోల్‌కతా ప్రతీకారం తీర్చుకునేనా..? ఫెర్గూసన్ ధాటికి ఆర్‌సీబీ నిలిచెనా?

IPL 2020, KKR vs RCB Preview: Who will win Kolkata Knight Riders vs Royal Challengers Bangalore

అబుదాబి: సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సూపర్‌‌ విక్టరీ సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ ప్లే ఆఫ్‌‌ అవకాశాలను మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. టేబుల్‌‌లో తమ కంటే ఒక స్థానం ముందున్న రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు(ఆర్‌‌సీబీ)తో బుధవారం అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో విరాట్‌‌ సేన 82 రన్స్‌‌ తేడాతో గెలిచింది.

మరోపక్క ఆడిన తొమ్మిది మ్యాచ్‌‌ల్లో 12 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌‌లో ఉన్న ఆర్‌‌సీబీ మరో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌‌కు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది. దీంతో మరో హోరాహోరీ పోరు ఖాయమనే చెప్పాలి. అయితే, ఫెర్గుసన్‌‌ను మోర్గాన్‌‌ ఎలా యూజ్‌‌ చేసుకుంటాడనే దానిపై కోల్‌‌కతా అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా గత మ్యాచ్ ఓటమికి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక ఆర్‌సీబీ ఆల్‌రౌండ్ షో ముందు చేతులెత్తెస్తుందో చూడాలి!

 లూకీ ఫెర్గుసన్ రాకతో..

లూకీ ఫెర్గుసన్ రాకతో..

న్యూజిలాండ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ లూకీ ఫెర్గుసన్‌‌ చేరికతో కేకేఆర్‌‌ ఇప్పుడు మరింత బలంగా తయారైంది. సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌పై చేసిన పెర్ఫామెన్స్‌‌ను లూకీ రిపీట్‌‌ చేయాలని కెప్టెన్ ఇయాన్‌‌ మోర్గాన్‌‌ భావిస్తున్నాడు. ఇంకో ఐదు మ్యాచ్‌‌లు మిగిలుండగా.. ప్రస్తుతం 10 పాయింట్లతో టేబుల్‌‌లో నాలుగో ప్లేస్‌‌లో ఉన్న కోల్‌‌కతాకు ఆర్​సీబీపై గెలవడం చాలా అవసరం.

అయితే ఆ జట్టును టాపార్డర్ వైఫల్యం వెంటాడుతుంది. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్,దినేశ్ కార్తీక్ పర్వాలేదనిపిస్తున్నా.. ఆండ్రూ రస్సెల్ పెర్ఫామెన్స్ నిరాశపరుస్తోంది. అయితే తన వివాదాస్పద యాక్షన్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న సునీల్ నరైన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో తొడ కండరాల సమస్యతో బాధపడిన రస్సెల్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. బౌలింగ్‌లో కమిన్స్,ఫెర్గూసన్, కల్యాన్ చక్రవర్తి రాణిస్తున్నా..కుల్దీప్ టచ్‌లోక రావాల్సి ఉంది.

పటిష్టంగా ఆర్‌సీబీ..

పటిష్టంగా ఆర్‌సీబీ..

ఆర్‌‌సీబీకి పెద్దగా సమస్యల్లేవు. మోరిస్‌‌ రాకతో జట్టుకు మరింత బ్యాలెన్స్‌‌ వచ్చింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఫించ్, పడిక్కల్, కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. నాలుగులో ఏబీడీ దుమ్ములేపుతున్నాడు. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా ఆడితే ఆ జట్టు బ్యాటింగ్‌లో తిరుగులేదు. బౌలింగ్‌లో మోరిస్,ఉడానా,నవ్‌దీప్ సైనీ చెలరేగుతున్నారు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లకు తిరుగులేదు. గత రెండు మ్యాచ్‌ల్లో సుందర్ పరుగులిచ్చినా.. అది పెద్ద సమస్యే కాదు. తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఆర్‌సీబీ ఖాతాలో మరో విజయం చేరడం ఖాయాం. శివమ్ దూబే కావాలనుకుంటే గుర్‌క్రీత్ బెంచ్‌కు పరిమితం కావచ్చు.

ముఖా ముఖి:

ముఖా ముఖి:

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు జరగ్గా 14-11తో కోల్‌కతానే పై చేయి సాధించింది. చివరగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ఇక గత సీజన్‌‌లో కూడా చెరొక విజయాన్నందుకున్నాయి. గత మ్యాచ్ ఆర్‌సీబీ గెలుపొందగా.. 2014లో యూఏఈల జరిగిన ఏకైక మ్యాచ్‌లో కేకేఆరే గెలుపొందింది.

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

అబుదాబి పిచ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చేజింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు మొత్తం 11 మ్యాచ్‌లు జరగ్గా 5 మ్యాచ్‌లు చేజింగ్ టీమ్సే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఈ మైదానంలో కేకేఆర్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. ఈ మైదానంలో ఏకైక మ్యాచ్ ఆడిన ఆర్‌సీబీ 8 వికెట్లతో రాజస్థాన్‌పై గెలుపొందింది. నెమ్మదైన వికెట్. స్పిన్‌కు అనుకూలం.

తుది జట్లు

తుది జట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్: శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్ (కీపర్), ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), ఆండ్రీ రస్సెల్/సునీల్ నరైన్, పాట్ కమిన్స్, లూకీ ఫెర్గుసన్, శివం మావి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్ (కీపర్), గుర్‌క్రీత్ సింగ్ /శివం దూబే, ఇసురు ఉడానా, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోర్రిస్, నవ్‌దీప్ సైనీ/మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, షెహ్‌బాజ్ అహ్మద్

IPL 2020: మహీ మంత్రం పనిచేయలేదు.. చెన్నై వైఫల్యానికి కారణాలివే!

Story first published: Wednesday, October 21, 2020, 14:01 [IST]
Other articles published on Oct 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X