న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: హర్భజన్‌ యూఏఈ వెళ్లడం లేదు.. కారణం ఏంటంటే!!

IPL 2020: Harbhajan Singh not to travel to Dubai with Chennai Super Kings squad

ముంబై: యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 2020 మ్యాచులు సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షార్జా, అబుదాబి మరియు దుబాయ్ వేదికల్లో అన్ని మ్యాచులు జరిగేలా బీసీసీఐ షెడ్యూల్ చేసింది. ఇక అన్ని ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను ఐపీఎల్‌ కోసం సిద్ధంగా ఉంచాయి. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి యూఏఈకి తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్ ‌(సీఎస్‌కే) శుక్రవారం దుబాయ్‌ బయలుదేరేందుకు సిద్ధమైంది.

 ధోనీసేనతో భజ్జీ వెళ్లట్లేదు:

ధోనీసేనతో భజ్జీ వెళ్లట్లేదు:

సీఎస్‌కే వెటరన్‌ ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చెన్నై ఆటగాళ్లతో కలిసి శుక్రవారం దుబాయ్‌ వెళ్లడం లేదు. తన తల్లి అనారోగ్యం కారణంగా హర్భజన్‌ ఆటగాళ్లతో కలిసి శుక్రవారం ప్రయాణించకూడదని నిర్ణయించుకున్నాడు. హర్భజన్‌ తన తల్లి ఆరోగ్యం కుదుటపడ్డాక.. రెండు వారల తర్వాత యూఏఈ వెళ్లనున్నాడట. ఇప్పటికే తన తల్లి అనారోగ్యం కారణంగా.. చెన్నై ప్రాంచైజీ ఏర్పాటు చేసిన ఐదు రోజుల స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ క్యాంప్‌కు కూడా దూరమయ్యాడు.

 అందరికీ నెగటివ్:

అందరికీ నెగటివ్:

చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాళ్లకు మంగళవారం నిర్వహించిన కరోనా వైరస్ టెస్టుల్లో అందరికీ నెగటివ్ అని తేలింది. సీఎస్‌కే బృందానికి మొత్తం టెస్టులు చేయడం ఇది రెండోసారి. దుబాయ్‌కు వెళ్లే 24 గంటల ముందు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరికీ రెండుసార్లు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయించాలి. అయితే ఫ్రాంచైజీలు ముందుజాగ్రత్తగా అంతకన్నా ఎక్కువే టెస్టులు చేయిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి బయోబుడగలో అడుగుపెడితే మళ్లీ బయటకు వెళ్లే ఆస్కారం ఉండదు. ఇక చెన్నై రేపు యూఏఈ ప్రయాణం కానుంది.

2016 నుంచి క్రికెట్‌కు దూరం:

2016 నుంచి క్రికెట్‌కు దూరం:

40 ఏళ్ల వయసున్న హర్బజన్ సింగ్.. 2016 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. భజ్జీ 2016లో చివరిసారి ఆసియాకప్‌లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. కెరీర్‌ మొత్తంలో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 ఆడిన హర్భజన్‌ వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు. 2018 ఐపీఎల్ వేలం ముందు సీఎస్‌కే 2 కోట్ల కనీస ధరకు హర్బజన్‌ను తీసుకుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున హర్భజన్‌ ఆడాడు. సీఎస్‌కే తరఫున చివరి రెండు ఎడిషన్‌లో 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌ల్లో 150 వికెట్లు పడగొట్టాడు.

IPL 2020: మన్కడింగ్‌పై వారిస్తా.. ఈసారి అశ్విన్‌ను అలా చేయనివ్వను: పాంటింగ్‌

Story first published: Thursday, August 20, 2020, 13:17 [IST]
Other articles published on Aug 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X