Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: మన్కడింగ్‌పై వారిస్తా.. ఈసారి అశ్విన్‌ను అలా చేయనివ్వను: పాంటింగ్‌

IPL 2020: Ricky Ponting reveals what he will speak to Ravichandran Ashwin about Mankading

సిడ్నీ: గత ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌)లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన 'మన్కడింగ్‌' పెద్ద దుమారమే లేపింది. మన్కడింగ్‌ ద్వారా జాస్‌ బట్లర్‌ను రనౌట్‌ చేయడంపై కొందరు మద్దతుపలకగా.. మరికొందరు దుమ్మెత్తిపోశారు. అయితే తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్‌ ఒకే మాటపై నిలబడ్డాడు. ఏదేమైనా అశ్విన్‌ లీగ్ మొత్తం వార్తల్లో నిలిచాడు. ఇక ఈసారి వేలంలో పంజాబ్ ప్రాంచైజీ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు వదులుకుంది. ఢిల్లీ హెడ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ వ్యవహరిస్తున్నాడు.

అశ్విన్‌ను అలా చేయనివ్వను:

అశ్విన్‌ను అలా చేయనివ్వను:

తాజాగా మన్కడింగ్‌పై రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ... ఇకపై అలాంటి ఘటన జరగదని, ఈ విషయంలో అశ్విన్‌తో గట్టిగా మాట్లాడతానన్నాడు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఎలాంటి ఘటనా జరగదని పాంటింగ్‌ హామీ ఇచ్చాడు. 'ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అలాంటి (మన్కడింగ్) తరహా క్రికెట్‌ను ఆడబోవడం లేదు. నేను ఆర్ అశ్విన్‌ను కలవగానే అన్నింటికింటే ముందు ఇదే విషయంపై మాట్లాడతా. గత ఏడాది అతను మా జట్టుతో లేడు' అని పాంటింగ్‌ తెలిపాడు.

 క్రీడా స్ఫూర్తికి విరుద్ధం:

క్రీడా స్ఫూర్తికి విరుద్ధం:

'ఆర్ అశ్విన్‌ అద్భుతమైన బౌలర్‌. మన్కడింగ్ ఘటన జరిగినప్పుడు నేను ఢిల్లీ ఆటగాళ్లతో కూడా అది తప్పని చెప్పాను. అశ్విన్‌ లాంటి స్థాయి ఆటగాడు అలా చేస్తే మరికొందరు అతడిని అనుసరిస్తారు. కాబట్టి ఇప్పుడు అతడిని కలిశాక దీనిపై కచ్చితంగా చర్చిస్తా. నాకు తెలిసి అతను మళ్లీ తన చర్యను సమర్థించుకోవచ్చు. అయితే క్రీడా స్ఫూర్తికి మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం. నేను, మా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మాత్రం అలాగే భావిస్తాం' అని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా:

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా:

ఆర్ అశ్విన్‌ మాదిరిగా మన్కడింగ్‌ ద్వారా బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేయడం తప్పేమీ కాదంటూ ఎంసీసీ రూపొందించిన నిబంధనల కమిటీలో రికీ పాంటింగ్‌ కూడా సభ్యుడు కావడం విశేషం. మరో వైపు 2008లో సిడ్నీలో భారత్‌తో జరిగిన టెస్టులో పలుమార్లు క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిన పాంటింగ్.. ఇప్పుడు క్రీడాస్ఫూర్తి మాటలు చెప్పడం హాస్యాస్పదమని భారత అభిమానులు అతనిపై విరుచుకుపడ్డారు.

వోక్స్‌ దూరం:

వోక్స్‌ దూరం:

ఢిల్లీ క్యాపిటల్స్‌ సౌతాఫ్రికా పేసర్‌ అన్రిచ్‌ నోర్జేను జట్టు‌లోకి తీసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ ఈ ఏడాది లీగ్‌ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో నోర్జేను ఎంపిక చేసినట్లు ఢిల్లీ పేర్కొంది. 26 ఏళ్ల నోర్జేకు ఇదే తొలి ఐపీఎల్‌ కాగా.. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో ఉన్నప్పటికీ గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ రూ.1.5 కోట్లకు వోక్స్‌ను దక్కించుకున్నది. అంతర్జాతీయ క్రికెట్లో వేసవిలో బిజీ షెడ్యూల్‌ కారణంగా ఫ్రెష్‌గా ఉండేందుకు ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని వోక్స్‌ నిర్ణయించుకున్నాడు.

చనిపోయే రెండు నిమిషాల ముందు ఆ సిక్సర్‌ను చూస్తా: భారత క్రికెట్ దిగ్గజం

Story first published: Thursday, August 20, 2020, 12:39 [IST]
Other articles published on Aug 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+