న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs CSK: రఫ్ఫాడించిన రాయుడు, డుప్లెసిస్.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!

 Rayudu and Jadeja set Dekhi steep 180-run chase

షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఫాఫ్ డుప్లెసిస్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), అంబటి రాయుడు(25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 45 నాటౌట్) రాణించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 రన్స్ చేసింది. చివర్లో రవీంద్ర జడేజా(13 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్) చెలరేగడంతో చెన్నై భారీ స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో దేశ్ పాండే, రబడా చెరొక వికెట్ తీయగా.. నోర్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే పరుగుల ఖాతా తెరవకుండానే సామ్‌ కరాన్‌(0) వికెట్‌ను కోల్పోయింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌ మూడో బంతికే కరాన్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో క్రీజులోకి వచ్చిన షేన్‌ వాట్సన్‌తో డూప్లెసిస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని నోర్జ్ విడదీసాడు. షేన్ వాట్సన్( 28 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 36 ) క్లీన్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో ధాటిగా ఆడబోయిన డుప్లెసిస్‌ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇక క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ(3) కూడా విఫలమయ్యాడు. నోర్జే వేసిన స్లోయర్ బాల్‌కు కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఈ పరిస్థితుల్లో అంబటి రాయుడు, జడేజా ధాటిగా ఆడారు.

కాగా, అంబటి రాయుడు( 50) మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడటంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే రెండు వికెట్లు సాధించగా, రబడా, దేశ్‌పాండేలకు తలో వికెట్‌ దక్కింది. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు పిండుకున్నారు. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

Story first published: Saturday, October 17, 2020, 21:31 [IST]
Other articles published on Oct 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X