ఈ ఓటమిపై మాటల్లేవ్.. అందుకే విలియమ్సన్ ఓపెనింగ్ వచ్చాడు: డేవిడ్ వార్నర్

అబుదాబి: గెలిచే మ్యాచ్‌లో ఓడటంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలు ఈ ఓటమిపై ఏ మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని, తన వద్ద మాటల్లేవన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో ఓడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విజయం కోసం వార్నర్ (33 బంతుల్లో 47 నాటౌట్) ఆఖరి బంతి వరకు పోరాడటంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది.

ఇక ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌‌కు సూపర్ ఓవర్‌లో మూడు బంతులు మాత్రమే ఆడిన హైదరాబాద్ రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం కోల్‌కతా నాలుగు బంతుల్లో 3 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన డేవిడ్ వార్నర్ జట్టు ఆటతీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గత రెండు మూడు మ్యాచ్‌లుగా తాము చేజింగ్‌లో విజయాలందుకోలేకపోతున్నామన్నాడు. ఇక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడాన్ని సమర్థించుకున్నాడు. ఫిట్‌నెస్ సమస్య కారణంగానే కేన్ ఓపెనర్‌గా వచ్చాడని తెలిపాడు.

'ఎలా మొదలు పెట్టాలి.. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. కానీ మేం గెలిచే మ్యాచ్‌లో ఓడాం. మిడిల్ ఓవర్లలో పరుగులిచ్చుకున్నాం. మరీ ముఖ్యంగా గత రెండు, మూడు మ్యాచ్‌లుగా చేజింగ్‌లో తడబడుతున్నాం. ఈ పిచ్ ఛేజింగ్‌కు అనుకూలం కావడంతోనే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నా. ఇదేం మా ఫలితంపై ప్రభావం చూపలేదు.

165 పరుగులు చేధించడం కష్టమేం కాదు. కానీ కీలక సమయంలో మేం వికెట్లు కోల్పోయాం. ఇక కేన్ తనను దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యతో బాధపడ్డాడు. ఫిజియో సహకారం తీసుకోవాల్సి వచ్చింది. దాంతోనే కేన్‌ ఓపెనర్‌గా వచ్చాడు'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

SRH vs KKR: Thrilling Super Over: Lockie Ferguson 'Unbelievable' Performance | IPL 2020

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ ఒక వికెట్ తీశాడు. అనంతరం హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులే చేసింది. వార్నర్‌తో పాటు బెయిర్ స్టో(36), విలియమ్సన్(29) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో ఫెర్గూసన్ మూడు వికెట్లు తీయగా.. కమిన్స్, మావీ,వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, October 18, 2020, 22:08 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X