న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తాజా కరోనా పరీక్షల్లో అందరికి నెగటీవ్!

IPL 2020: All the players and support staff from Chennai Super Kings have been tested negative
IPL 2020 : Chennai Super Kings Might Not Play The Opening Match Of IPL 2020 || Oneindia Telugu

దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్. కరోనా కొరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆ జట్టుకు భారీ ఉపశమనం లభించింది. సోమవారం నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో సహాయక సిబ్బందితో సహా ఆటగాళ్లందరికి నెగటీవ్ వచ్చింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. గురువారం(సెప్టెంబర్ 3) మరోసారి నిర్వహించే పరీక్షల్లో నెగటీవ్ వస్తే ఆ జట్టు నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు మార్గం సుగమం కానుంది.

ఇక దుబాయ్‌లో 6 రోజుల క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్‌కు సిద్దమైన ఆ జట్టుకు నిబంధనల మేరకు గత శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో యువపేసర్ దీపక్ చాహర్‌తో పాటు 11 మంది సహాయక సిబ్బందికి కరోనా పాజిటీవ్ అని తెలింది. అనంతరం మరో యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా కరోనా సోకింది. దీంతో చెన్నై శిభిరంలో తీవ్ర గందరగోళం నెలకొనగా.. ఆ జట్టు వైస్ కెప్టెన్ సురేశ్ రైనా వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆటగాళ్లు, జట్టు యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో తాజా పరీక్షా ఫలితం వారికి ఉపశమనం ఇచ్చింది. అయితే గురువారం జరిగే పరీక్షల్లో నెగటీవ్ వచ్చినా.. దీపక్ చాహర్, రుతురాజ్‌ల క్వారంటైన్ కొనసాగనుంది. వారు సెప్టెంబర్ 12 వరకు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండనున్నారు. వీరితో పాటే మంగళవారం దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆ జట్టు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఫాఫ్ డూప్లెసిస్, లుంగి ఎంగిడి కూడా వారం రోజుల క్వారంటైన్ పాటించనున్నారు.

క్యాష్ రిచ్ లీగ్‌లో పాల్గొనడంపై స్పష్టత ఇవ్వని ఆ జట్టు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ప్రస్తుతానికి తన ప్రయాణాన్ని వాయిదా వెసుకున్నాడు. తన తల్లి అనారోగ్యంతో ఆలస్యంగా జట్టుతో కలుస్తానన్నా హర్భజన్ మంగళవారం దుబాయ్‌లో అడుగుపెట్టాల్సింది. కానీ జట్టు శిభిరంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అతను పునరాలోచనలో పడ్డాడు. ఈ ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని కూడా అనుకుంటున్నట్లు అతని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులతో భజ్జీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడుతాయని, లీగ్‌లో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని చెన్నై ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపారు.

ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా బాటలోనే ఇతర ఆటగాళ్లు: ప్యాడీ ఆప్టన్ఐపీఎల్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనా బాటలోనే ఇతర ఆటగాళ్లు: ప్యాడీ ఆప్టన్

Story first published: Tuesday, September 1, 2020, 17:07 [IST]
Other articles published on Sep 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X