న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుణ్ చక్రవర్తి పంజాబ్ జట్టుకు దీర్ఘకాల పెట్టుబడి: ప్రీతి జింతా

IPL 2019: Varun Chakravarthy is back-up spinner who will add value to Kings XI Punjab - Preity Zinta

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-19 వేలంలో సంచలనమైన ధరకు అమ్ముడుపోయాడు తమిళనాడు క్రికెటర్ వరుణ్ చక్రవర్తి. ప్రారంభ ధర రూ.20లక్షల నుంచి అనూహ్యంగా అధిక ధర పలుకుతూ కోట్ల రూపాయలు దాటేశాడు. అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలంతా పోటీపడ్డాయి. ఈ క్రమంలో ధర పెరుగుతూ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా.. తమిళనాడు క్రికెటర్‌ వరుణ్‌ చక్రవర్తి తమ జట్టుకు 'దీర్ఘ కాల పెట్టుబడి' లాంటి వాడని అన్నారు. కెప్టెన్ గా కొనసాగుతున్న స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌కు బ్యాకప్‌ స్పిన్నర్‌గా ఉంటాడని పేర్కొన్నారు.

చదువును మధ్యలో ఆపేసి క్రికెట్‌లోకి

చదువును మధ్యలో ఆపేసి క్రికెట్‌లోకి

ఇటీవలి కాలంలో ముగిసిన తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో వరుణ్‌ అసమాన ప్రతిభను కనబరిచాడు. మిస్టరీ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడిన వరుణ్ చక్రవర్తి అతని జట్టు మధురై ఫాంథర్స్ టైటిల్ గెలవడం‌లో క్రియాశీలక పాత్ర పోషించాడు. 20ఏళ్ల వయసులో తాను చదువుతున్న ఆర్కిటెక్చర్ మధ్యలో ఆపేసి క్రికెట్‌లోకి వచ్చిన ఈ స్పిన్నర్ ఏడు వేరియేషన్స్‌లో బంతిని వేయగలడు. ఇందులో ఆఫ్‌ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, ప్లిపర్, టాప్ స్పిన్నర్ తదితర వేరియేషన్స్ ఉన్నాయి.

మొత్తంగా మిస్టరీ స్పిన్నర్ 22 వికెట్లు

మొత్తంగా మిస్టరీ స్పిన్నర్ 22 వికెట్లు

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌ ఫైనల్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ స్పిన్నర్ 2 వికెట్లు తీసి.. కేవలం 9 పరుగులు మాత్రమే ఇవ్వడం కొసమెరుపు. మొత్తంగా టోర్నీలో అతని ఎకానమీ 4.7గా ఉండటం అతని మిస్టరీ బౌలింగ్‌ని ప్రస్ఫుటం చేస్తోంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌‌లోనే కాకుండా.. విజయ్ హజారే ట్రోఫీలోనూ ఈ మిస్టరీ స్పిన్నర్ 22 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ టీమ్స్‌కి నెట్స్ వరుణ్ సాయం చేశాడు.

రూ.8.4కోట్లకు రికార్డు ధర: ఎవరీ వరుణ్ చక్రవర్తి?

2019 వేలంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు

2019 వేలంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు

వరుణ్‌ అందరికీ తెలియని మిస్టరీ స్పిన్నర్‌. బ్యాకప్‌ స్పిన్నర్‌గా జట్టుకు విలువ తీసుకొస్తాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బయటపడని ప్రతిభకు కచ్చితంగా అవకాశాలు ఇస్తుంది. వరుణ్‌ మాకు దీర్ఘ కాల పెట్టుబడి. కోచ్‌ మైక్‌ హెసన్‌ మార్గదర్శనంలో సామర్థ్యాలను మెరుగు పరుచుకొని జట్టు విజయానికి తోడ్పడగలడు. 2019 వేలంలో మేం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నాం. పటిష్ఠ జట్టును నిర్మించేందుకు అవసరమైన ఆటగాళ్లను ఎంచుకున్నాం. ఇప్పుడు మాకు సమతూకమైన జట్టుంది. అవసరాలకు తగినట్టు ఆటగాళ్లు ఉన్నారని ప్రీతి జింతా అన్నారు.

అనుభవం లేకున్నా తాము ప్రోత్సహిస్తామని

అనుభవం లేకున్నా తాము ప్రోత్సహిస్తామని

ఇంకా రంజీల్లో అరంగేట్రం చేయని పంజాబ్‌ ఆటగాడు ప్రభు సిమ్రన్‌ సింగ్‌ను కింగ్స్‌ ఎలెవన్‌ రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసింది. అనుభవం లేకున్నా ప్రతిభ ఉంటే తాము ప్రోత్సహిస్తామని జింతా తెలిపారు. ఏ ఆటగాడినైనా కొనేముందు కింగ్స్‌ ఎలెవన్‌ జట్టు యాజమాన్యం ఎంతో పరిశోధన చేస్తుందని వెల్లడించారు. స్థానిక కుర్రాడైన ప్రభు ప్రతిభ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ప్రీతి జింతా ధీమా వ్యక్తం చేశారు.

Story first published: Friday, December 28, 2018, 9:53 [IST]
Other articles published on Dec 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X