న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ.8.4కోట్లకు రికార్డు ధర: ఎవరీ వరుణ్ చక్రవర్తి?

IPL Auction 2019 Updates : Varun Chakravarthy Won The Day's Biggest Bid
Varun Chakravarthy Gets Rs 8.4 Crore

జైపూర్: తమిళనాడుకు చెందిన ఓ అనామక ఆటగాడి రూ.8.4 కోట్లకు అమ్ముడుపోయాడు. కోల్‌‌కతా నైట్ రైడర్స్ ప్రారంభ ధర రూ.20లక్షలుగా వేలంలోకి వచ్చిన వరుణ్ చక్రవర్తిని అత్యధిక ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్ నుంచి కోల్‌కతా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న దినేశ్ కార్తీక్ కూడా తమిళనాడు వాడే. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో అడుగుపెట్టని చక్రవర్తి అరంగ్రేటం ఘనంగా జరిగింది. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆడటం బాగా కలిసొచ్చిందని తెలిపాడు.

వరుణ్ చక్రవర్తితో కలిసి నెట్స్‌లో

వరుణ్ చక్రవర్తితో కలిసి నెట్స్‌లో

వరుణ్ చక్రవర్తికి కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న కార్తీక్ గత సీజన్‌లో వరుణ్ చక్రవర్తితో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడట. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో చక్కగా రాణిస్తోన్న చక్రవర్తి గురించి తెలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు కార్తీక్ పిలిపించాడట. ఇలా ఆ జట్టు కోచ్ సునీల్ నరైన్ తనకు బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడని అవి కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివరించాడు.

టీపీఎల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వరుణ్

టీపీఎల్ ప్రాతినిధ్యం వహిస్తోన్న వరుణ్

తమిళనాడు ప్రీమియర్ లీగ్ దిండుగల్ డ్రాగన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న వరుణ్.. రెండేళ్లుగా తన ఆటలో చాలా మార్పులొచ్చాయని చెప్పుకొచ్చాడు. వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్ అయిన వరుణ్.. తొలి అవకాశం అందుకున్నాక తన సత్తా చాటాడు. ఇప్పుడు తాను ఐదు రకాలుగా బౌలింగ్ చేయగలనని చెప్పుకొస్తున్నాడు.

ముందు బ్యాట్స్‌మన్.. ఇప్పుడు బౌలర్

ముందు బ్యాట్స్‌మన్.. ఇప్పుడు బౌలర్

క్రికెట్ కెరీర్‌లో తొలి నాళ్లలో నేను వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మానేసి రెండేళ్ల పాటు వేరే పనిలో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా మళ్లీ ఆడటం మొదలుపెట్టాను. దాంతో నా మోకాళ్లపై భారం అధికమైంది. ఓ మ్యాచ్‌లో మోకాలికి గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఆటకు విరామం తీసుకున్నాను. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత జూబ్లీ సీసీలో నాలుగో డివిజన్‌లో ఆడుతున్నాను. ఇక్కడ సహాయక సిబ్బంది నాకు చాలా సహకరిస్తున్నారు.

టెన్నిస్ బాల్ నుంచి క్రికెట్ బాల్‌కు..

టెన్నిస్ బాల్ నుంచి క్రికెట్ బాల్‌కు..

టెన్నిస్ బాల్‌తో కూడా అనుభవమున్న నాకు క్రికెట్ బాల్ అలవాటు చేసుకోవడానికి చాలా ఏళ్ల వరకూ సమయం పట్టిందని చెప్పుకొచ్చాడు. గతంలో న్యూస్ పేపర్‌లోనూ చూసుకోలేదని టీపీఎల్ ఆడటం వల్లే ఇది సాధ్యమైందని అతని ఆనందాన్ని ఉద్వేగంగా బయటపెట్టాడు.

Story first published: Tuesday, December 18, 2018, 18:54 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X