న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై ఇండియన్స్ బస్సు ఎవరెక్కితే బాగుంటుంది??

IPL 2019: Mumbai Indians ask fans to send suggestions for IPL 2019 auctions. Heres what came up

న్యూ ఢిల్లీ: ప్రచారంతో పాటు అభిమానుల సలహాలు కూడా తీసుకునేందుకు సిద్ధమైయ్యాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ క్రమంలోనే గురువారం తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు పేరు మార్చుకున్న జట్టు తమ జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను సూచించాలంటూ అభిమానులను ట్విట్టర్ ద్వారా సలహా అడిగింది. విశేష స్పందన లభించడంతో.. ఇప్పుడు అదే బాటలో ముంబై ఇండియన్స్ పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏదో ఒక ప్రాంఛైజీ తమను తీసుకోవాలని

ఏదో ఒక ప్రాంఛైజీ తమను తీసుకోవాలని

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం డిసెంబర్ 18 జైపూర్ వేదికగా జరగనుంది. కొద్ది రోజుల ముందే అంటి పెట్టుకున్న ఆటగాళ్లను మినహాయించి మిగిలిన క్రికెటర్లందరినీ విడుదల చేస్తున్నట్లు బీసీసీఐకి జాబితా పంపించేశాయి అన్ని ఫ్రాంచైజీలు. వారంతా ఈ వేలంలో ఏదో ఓ జట్టుకు సొంతమై తమ సత్తా నిరూపించుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్‌లో ఏదో ఒక ప్రాంఛైజీ తమను తీసుకోవాలని కోరుకుంటున్నారు.

బస్సుపైకి ఎవరి బొమ్మ రావాలి

జైపూర్ వేదికగా డిసెంబర్‌ 18న జరగనున్న వేలంలో 1003 మంది పేర్లు నమోదు చేసుకోగా 346 పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏ ఆటగాళ్లను తీసుకోవాలని 3 సార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ అభిమానులను కోరింది. పేర్లు చెప్పాలంటూ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో సూచించింది. ఆటగాళ్లంతా ఉన్న బస్సు ఫొటో పోస్టు చేసి ‘బస్సుపైకి ఎవరి బొమ్మ రావాలి' అని అభిమానులను అడిగింది.

ఆస్ట్రేలియా తాను తీసిన గోతిలో తానే పడనుందట!!

చాలామంది టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్‌

అభిమానుల్లో చాలామంది టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకరైతే షాన్‌మార్ష్‌/యువరాజ్‌/ముష్ఫికర్‌/మహ్మదుల్లా పేర్లతో జాబితా ఇచ్చారు. గతేడాది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఆడిన యువీ ఫామ్‌ను రాబట్టుకోలేకపోయాడు. దీంతో ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోవడంతో ప్రస్తుతం అతణ్ని పంజాబ్ విడుదల చేసేసింది. ప్రస్తుతం యువీ.. రూ.2 కోట్ల నుంచి కనీస ధరను రూ.కోటికే మార్చుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎవరో చెప్పాలంటూ

కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీలు యువీని తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికైతే కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో మిడిలార్డర్‌లో సీనియర్‌ ఆటగాళ్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఇదే తరహాలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరుంటే బాగుంటుందో చెప్పాలంటూ.. ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Story first published: Friday, December 14, 2018, 10:07 [IST]
Other articles published on Dec 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X