న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్ పిచ్‌పై విమర్శలు: ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదన్న ధోని

IPL 2019: MS Dhoni Criticises Chepauk Track Despite Winning Start For Chennai Super Kings

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ మ్యాచ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలి మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్లు ఉంటాయని స్టేడియానికి వెళ్లిన వారంతా ఉసూరుమంటూ మ్యాచ్ అనంతరం తిరిగొచ్చారు. స్పిన్‌కు అనుకూలించిన చెపాక్ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ ఆపసోపాలు పడటంతో తొలి మ్యాచ్ అభిమానులకు బోర్ అనిపించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆర్సీబీ కేవలం 70 పరుగులకే ఆలౌట్

ఆర్సీబీ కేవలం 70 పరుగులకే ఆలౌట్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ కేవలం 70 పరుగులకే కుప్పకూలడం... ఆ తర్వాత చెన్నై ఆ మాత్రం స్కోరును చేజ్ చేయడానికి కూడా శ్రమించడం అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. అటు చెన్నై కెప్టెన్ ధోనీ కూడా తన హోమ్ గ్రౌండ్ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ చాలా చాలా మెరుగ్గా ఉండాలని అభిప్రాయపడ్డాడు.

ఇలాంటి పిచ్‌పై ఆడటం కష్టమే

ఇలాంటి పిచ్‌పై ఆడటం కష్టమే

ఇలాంటి పిచ్‌పై తమ టీమ్ ఆడటం కూడా కష్టమేనని మ్యాచ్ అనంతరం ధోని వెల్లడించాడు. "ఇలాంటి పిచ్‌ను అస్సలు ఊహించలేదు. 2011 చాంపియన్స్ లీగ్ పిచ్ గుర్తుకొచ్చింది. గతేడాది ఈ పిచ్ బాగానే ఉంది. కానీ సడెన్‌గా ఇలాంటి పిచ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఇలాగే ఉంటే మాకు కూడా కష్టమే. దీనిని మెరుగు పరచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది" అని అన్నాడు.

స్పిన్‌కు ఇంతగా అనుకూలించడం అసాధారణం

స్పిన్‌కు ఇంతగా అనుకూలించడం అసాధారణం

"మంచు పడుతున్నా కూడా స్పిన్‌కు ఇంతగా అనుకూలించడం అసాధారణం. కనీసం 140 స్కోరయినా అయితేనే బాగుంటుంది. 80, 90, 100, 120 చాలా తక్కువ స్కోర్లు. ఇదే పిచ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా.. దీని తీవ్రత అప్పుడు తెలియలేదు. తమ టీమ్‌లో మంచి హిట్టర్లు ఉన్నారని, వాళ్లు భారీ షాట్లు ఆడాలని అనుకుంటారు" అని ధోని చెప్పాడు.

ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదు

ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదు

"టాస్ మన చేతుల్లో ఉండదు కాబట్టి.. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ అయితే మంచిది. నిలకడగా రాణించాలంటే మాత్రం ఇలాంటి పిచ్ అస్సలు పనికి రాదు" అని ధోని తెలిపాడు. చెపాక్ వేదికగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, March 24, 2019, 14:35 [IST]
Other articles published on Mar 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X