For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అది నా లక్కీ టీమ్.. ఆయన వల్లే టీమిండియా హెడ్ కోచ్ పదవి: గంభీర్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్) ఫ్రాంచైజీతో తనది విడదీయని బంధమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. కేకేఆర్‌తో తనకు అదృష్టమని, కెప్టెన్‌గా, కోచ్‌గా తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టిందన్నాడు. అసలు తాను టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ప్రధాన కారణం కేకేఆర్ అని గంభీర్ స్పష్టం చేశాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ విజేతగా నిలవడంలో హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమ్ సెలెక్షన్ నుంచి మైదానంలో అమలు చేసే వ్యూహాల వరకు అన్నీ తానై నడిపించాడు. దాంతో ఆటగాడిగా.. కోచ్‌గా టీ20 ప్రపంచకప్ గెలిచిన ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా భారత జట్టుకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కోచ్‌గా గంభీర్ చరిత్రకెక్కాడు.

Gautam Gambhir Credits KKR Stint for India Head Coach Role Admits I Wouldn t Be Here Without KKR
Photo Credit: twitter (X)

జై షా వల్లే హెడ్ కోచ్ పదవి..

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంలో కేకేఆర్‌ ఫ్రాంచైజీది కీలక పాత్ర అని గంభీర్ తెలిపాడు.' 7-8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నేను కోల్‌కతా జట్టు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాను. ఆ సీజన్‌లో కేకేఆర్ మెరుగైన ప్రదర్శన చేసి విజేతగా నిలవడంతో అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా టీమిండియా హెడ్ కోచ్ పదవిని ఆఫర్ చేశాడు.

అయితే గతంలో నాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. దాంతో మొదట్లో సంకోచించాను. మెంటార్‌గా ఉండటానికి, హెడ్ కోచ్‌గా ఉండటానికి చాలా తేడా ఉంటుంది. అయినప్పటికీ భారత క్రికెట్‌పై నాకు ఉన్న అనుబంధం కారణంగా ఈ సవాల్‌ను స్వీకరించేందుకు అంగీకరించాను.

కేకేఆర్ నా లక్కీ టీమ్..

ఐపీఎల్ 2024 సీజన్‌లో నేను కేకేఆర్‌ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టకపోయినా.. ఆ జట్టు టైటిల్ గెలవకపోయినా ఈ రోజు నేను టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండేవాడిని కాదు. నా ఎదుగుదలకు కోల్‌కతానే ఒక ప్రధాన కారణం. కెప్టెన్‌గా.. ఇప్పుడు కోచ్‌గా కూడా కోల్‌కతా నాకు ఎప్పుడూ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ జట్టుతో.. ఆ నగరంతో నాకు ఒక ప్రత్యేకమైన బంధం ఉంది.

Story first published: Tuesday, March 17, 2026, 15:01 [IST]
Other articles published on Mar 17, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+