అద్భుతమైన బంతితో కోహ్లీని బోల్తా కొట్టించాడిలా! (వీడియో)

Posted By:
Mujeeb Ur Rahman

హైదరాబాద్: బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ యువ స్పిన్నర్ ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ అద్భుతం చేశాడు. తన అద్భుతమైన డెలివరీతో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్డ్ చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌లో ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ వెలుగులోకి వచ్చాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఈ యువ స్పిన్నర్ వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడు. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌‌లో అద్భుతమైన బంతితో కోహ్లీని పెవిలియన్‌కు చేర్చాడు. ముజీబ్ వేసిన బంతి కోహ్లీకి కూడా అర్ధం కాలేదంటే నమ్మండి.

అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి 21 శతాబ్ది క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పిన ఈ అప్ఘాన్ స్పిన్నర్ విసిరిన బంతికి దిగ్గజ ఆటగాడైన కోహ్లీ దగ్గర సమాధానం లేదు. పంజాబ్‌ నిర్దేశించిన 156 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది.

అక్షర్‌ పటేల్‌ వేసిన బంతిని షాట్‌ ఆడిన మెక్‌కలమ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. 16 బంతుల్లో 21 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాలుగు ఫోర్లు బాది ఫామ్‌లోకి వచ్చాడు. అయితే ఈ 17 ఏళ్ల ఈ యువస్పిన్నర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌తో కింగ్స్ ఎలెవన్ బౌలర్లంతా కలిసి ఐపీఎల్‌లో కోహ్లీకి 203 బంతులు విసరగా.. ఒక్కసారి కూడా అతన్ని ఔట్ చేయలేకపోయారు. అంతేకాదు వారి బౌలింగ్‌లో కోహ్లీ 264 పరుగులు రాబట్టాడు. కానీ ముజీబ్ మాత్రం తాను విసిరిన ఐదో బంతికే కోహ్లీని అవుట్ చేశాడు.

అశ్విన్ బౌలింగ్ వీడియోలను చూస్తూ క్యారమ్ బంతులేయడం ఎలాగో నేర్చుకున్న ముజీబ్ అతడి కెప్టెన్సీలోనే కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. కోహ్లీని ముజీబ్ పెవిలియన్‌కు చేర్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 23:45 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి