జెర్సీ నంబర్ 555 అసలు రహస్యం వెల్లడించి వాషింగ్టన్ సుందర్

Posted By:
IPL 2018: Washington Sundar decodes secret behind jersey number 555

హైదరాబాద్: వాషింగ్టన్ సుందర్... ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న యువ క్రికెటర్. గతేడాది రవిచంద్రన్‌ అశ్విన్‌ ఐపీఎల్‌కు దూరం కావడంతో అనుకోకుండా రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

గత సీజన్‌లో వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఈ ఏడాది జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.3.2 కోట్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ యాజమాన్యం అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 11వ సీజన్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేస్తోన్న వాషింగ్టన్ సుందర్ జెర్సీ నంబర్‌పై అభిమానుల్లో ఓ ఆసక్తి నెలకొంది.

IPL 2018: Washington Sundar decodes secret behind jersey number 555

ఐపీఎల్‌లో వాషింగ్టన్ సుందర్ 555వ నంబర్ జెర్సీని ఎంచుకున్నాడు. అయితే, సుందర్ తన జెర్సీపై ఈ నంబర్‌ను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకునేందుకు అభిమానులు గూగుల్‌లో వెతుకున్నారంట. ఇదే విషయాన్ని సుందర్‌ని అడగ్గా అసలు విషయం చెప్పేశాడు.

స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్యూలో వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ 'నేను 1999 అక్టోబరు 5న ఉదయం 5:05గంటలకు పుట్టాను. కాబట్టి నేను నా కిట్‌ నంబర్‌ను 555గా ఎంచుకున్నాను' అని చెప్పాడు. గతేడాది 11 మ్యాచ్‌లాడిన సుందర్‌ 8వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఏడాది ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మూడు మ్యాచ్‌లాడిన సుందర్‌ కేవలం 3 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు. టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలో వాంఖడె స్టేడియంలో జరగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 16, 2018, 13:31 [IST]
Other articles published on Apr 16, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి