ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్, వేదికలు, టైమింగ్స్, ఛానల్ ఇన్ఫో

Posted By:
IPL 2018 : Sunrisers Hyderabad (SRH) Schedule Information
 IPL 2018: Sunrisers Hyderabad (SRH) Schedule, Timings, Venue and TV Channel Information

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభానికి ఇక రెండు రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు పూర్తి సన్నద్ధంలో మునిగిపోయాయి. 2016 సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ అదే కొనసాగింపుని ఈ సీజన్‌లో కూడా ప్రదర్శించాలని ఊవిళ్లూరుతోంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

రెండేళ్ల క్రితం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై ఘన విజయం సాధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుగా మారడానికి ముందు డెక్కన్ ఛార్జర్స్ 2009లో ఐపీఎల్ టైటిల్ నెగ్గింది.

ఐపీఎల్ 11వ సీజన్‌లో విదేశీ ఆటగాడు కెప్టెన్‌గా ఉన్న ఏకైక జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సీజన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటుంటే మిగతా అన్ని జట్లకు స్వదేశీ ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు. బాల్ టాంపరింగ్ ఘటన వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

దీంతో అతడి స్థానంలో సన్ రైజర్స్ యాజమాన్యం కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016 ఐపీఎల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరిలో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం మనీశ్ పాండేను రూ.11 కోట్లకు సొంతం చేసుకుంది.

దీంతో ఈ సీజన్‌లో అతడిపై సన్ రైజర్స్ భారీగా అంచనాలు పెట్టుకుంది. మరోవైపు శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్‌లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. టామ్ మోడీ తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జట్టు మెంటార్‌గా వీవీఎస్ లక్ష్మణ్ తన విలువైన సలహాలను ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు.

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ కోచ్‌గా యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పుతున్నారు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ లేకుండా బరిలోకి దిగుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

ఐపీఎల్ 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్:

Monday, April 9

vs Rajasthan Royals at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Thursday, April 12

vs Mumbai Indians at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Saturday, April 14

vs Kolkata Knights Riders at 8 pm (2000 hrs), Eden Gardens, Kolkata


Thursday, April 19

vs Kings XI Punjab at 8 pm (2000 hrs), IS Bindra Stadium, Mohali


Sunday, April 22

vs Chennai Super Kings at 4 pm (16000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Tuesday, April 24

vs Mumbai Indians at 8 pm (2000 hrs), Wankhede Stadium, Mumbai


Thursday, April 26

vs Kings XI Punjab at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Sunday, April 29

vs Rajasthan Royals at 4 pm (1600 hrs), Sawai Mansingh Stadium, Jaipur


Saturday, May 5

vs Delhi Daredevils at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Monday, May 7

vs Royal Challengers Bangalore at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


Thursday, May 10

vs Delhi Daredevils at 8 pm (2000 hrs), Feroz Shah Kotla Ground, Delhi


Sunday, May 13

vs Chennai Super Kings at 4 pm (1600 hrs), MA Chidambaram Stadium, Chennai


Thursday, May 17

vs Royal Challengers Bangalore at 8 pm (2000 hrs), M Chinnaswamy Stadium, Bengaluru


Saturday, May 19

vs Kolkata Knights Riders at 8 pm (2000 hrs), Rajiv Gandhi International Cricket Stadium, Hyderabad


All matches will be broadcast on Star Sports 1/3 and streamed on Hotstar

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, April 4, 2018, 13:54 [IST]
Other articles published on Apr 4, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి