న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2018, RR vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి (వీడియో)

By Nageshwara Rao
IPL 2018, RR vs KKR: Sunil Narine concedes 48 runs in his 4 overs first time in ipl history

హైదరాబాద్: ఐపీఎల్ చరిత్రలో వంద వికెట్లు తీసిన తొలి విదేశీ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన వెస్టిండిస్ యువ స్పిన్నర్ సునీల్ నరైన్.. బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే చాలా పొదుపుగా బౌలింగ్ వేసే బౌలర్లలో సునీల్ నరేన్ ఒకడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్లో రహానే దెబ్బకు సునీల్ నరేన్ విలవిల్లాడాడు. తొలి మూడు ఓవర్లలో పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్‌ 9 పరుగులు మాత్రమే ఇవ్వడంతో... నాలుగో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన నరైన్ లక్ష్యంగా రహానే బౌండరీలతో విరుచుకు పడ్డాడు. రహానే వరుసగా నాలుగు ఫోర్లు బాదడంతో.. నరేన్ ఒక్క ఓవర్లోనే 18 పరుగులు సమర్పించుకున్నాడు.

దీంతో నాలుగు ఓవర్లకు గాను రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో నరైన్‌కు ఇదే చెత్త బౌలింగ్ రికార్డ్ కావడం గమనార్హం. నిజానికి మధ్య ఓవర్లలో బౌలింగ్ వేసే సునీల్ నరేన్ ఈ మ్యాచ్‌లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇదిలా ఉంటే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో నరేన్ కూడా ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌లో కులకర్ణి వేసిన నాలుగో ఓవర్‌లో సునీల్‌ నరైన్‌ హ్యాట్రిక్‌ ఫోర్‌ సాధించి బదులు తీర్చుకున్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో నరేన్ వేసిన నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ రహానే వరుస బంతుల్లో నాలుగు ఫోర్లు బాదగా... నరేన్ కూడా కోల్‌కతా ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌లోనే హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనకు అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

రాజస్థాన్‌పై అలవోక విజయం

రాజస్థాన్‌పై అలవోక విజయం

బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. షార్ట్‌ (43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44), రహానె (19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మాత్రమే రాణించారు. నితీష్ రాణా, కరాన్‌ రెండేసి వికెట్లు తీశారు.

 18.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు

18.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు

అనంతరం చేధనకు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు చేసి విజయం సాధించింది. రాబిన్‌ ఊతప్ప (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48), సునీల్‌ నరైన్‌ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) శుభారంభం చేయగా నితీష్‌ రాణా (27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్‌), దినేశ్‌ కార్తీక్‌ (23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్‌) చివర్లో చెలరేగారు.

పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌

పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే నిదానంగా సాగింది. కోల్‌కతా బౌలింగ్‌కు పరుగులు తీసేందుకు బ్యాట్స్‌మెన్‌ ఇబ్బందిపడ్డారు. తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ కూడా లేదు. అప్పటికి స్కోరు కేవలం 9 పరుగులే. అయితే నాలుగో ఓవర్‌లో కెప్టెన్‌ రహానె వరుసగా నాలుగు ఫోర్లతో చెలరేగి ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. ఆ తర్వాత కూడా ఓ సిక్స్‌, ఫోర్‌తో ఆకట్టుకున్నా ఏడో ఓవర్‌లో అతడిని కీపర్‌ కార్తీక్‌ మెరుపు వేగంతో స్టంపౌట్‌ చేశాడు.

 శివమ్‌ మావి బౌలింగ్‌లో ఔటైన సంజూ శాంసన్

శివమ్‌ మావి బౌలింగ్‌లో ఔటైన సంజూ శాంసన్

ఆ తర్వాత బెంగళూరుపై దుమ్మురేపిన శాంసన్‌ (7) శివమ్‌ మావి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఊపు మీదున్న షార్ట్‌ 12వ ఓవర్‌లో వరుసగా 6,4తో ఆకట్టుకున్నాడు. కానీ 13వ ఓవరల్‌ రాణా అతడిని బౌల్డ్‌ చేయగా మరుసటి ఓవర్‌లో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. త్రిపాఠి (15) పెవిలియన్‌కు చేర్చాడు. ఎప్పటిలాగే స్టోక్స్‌ (14) మరోసారి నిరాశపరచగా చివర్లో బట్లర్‌ (24 నాటౌట్‌) రాణించడంతో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది.

తొలి ఓవర్ లోనే క్రిస్‌లిన్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా

తొలి ఓవర్ లోనే క్రిస్‌లిన్ వికెట్ కోల్పోయిన కోల్‌కతా

ఆ తర్వాత తొలి ఓవర్‌లోనే కోల్‌కతా క్రిస్ లిన్‌ వికెట్‌ కోల్పోయింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్‌ తమ వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. నరైన్‌, ఊతప్ప జోడీ వరుస బౌండరీలతో స్కోరును కదం తొక్కించింది. నాలుగో ఓవర్‌లో నరైన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగగా.. ఆ తర్వాత ఓవర్‌లో ఊతప్ప సైతం మూడు ఫోర్లు బాదాడు.

మరో ఏడు బంతులుండగానే కోల్‌కతా విజయం

మరో ఏడు బంతులుండగానే కోల్‌కతా విజయం

తొమ్మిది ఓవర్ల పాటు వీరిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజస్థాన్‌ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు వరద సాధించారు. అయితే లేని పరుగు కోసం వెళ్లిన నరేన్ రనౌట్‌ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఊతప్ప లాంగ్‌ ఆన్‌లో భారీ షాట్‌ ఆడగా బౌండరీ లైన్‌ దగ్గర స్టోక్స్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 17వ ఓవర్‌లో దినేశ్‌ కార్తీక్‌, రాణా చెరో సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టారు. ఇక చివరి 18 బంతుల్లో 19 పరుగులు రావాల్సి ఉండగా మరో ఏడు బంతులుండగానే కోల్‌కతా విజయం సాధించింది.

Story first published: Thursday, April 19, 2018, 8:43 [IST]
Other articles published on Apr 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X